పెళ్ళైన మొదటి రాత్రే యువతికి షాకిచ్చిన వరుడు. చివరికి  తల్లిదండ్రులు వచ్చి..!

పెళ్ళైన మొదటి రాత్రే యువతికి షాకిచ్చిన వరుడు. చివరికి తల్లిదండ్రులు వచ్చి..!

పెళ్లి జరిగిన రాత్రి విజయవాడలోని వరుడి ఇంట్లో కొత్త జంటకు శోభనం ఏర్పాట్లు చేశారు. అందరి లాగే ఆ యువతి కూడా సిగ్గుపడుతూ శోభనం గదిలోకి వెళ్లింది. భర్తతో తొలిరాత్రికి ఎన్నో ఆశలతో శోభనం గదిలో అడుగుపెట్టిన ఆమెకు.. కాసేపటికే ఊహించని నిజం తెలిసింది. తాను గే అని… తనకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదని భర్త చెప్పడంతో ఆమె షాక్ తిన్నది. ఏదో పెద్దల బలవంతానికే పెళ్లి చేసుకున్నాను తప్ప… నీపై నాకెలాంటి ఆసక్తి లేదని అతను చెప్పడంతో ఆమె నోట మాట రాలేదు. పైగా ఈ విషయం ఎవరితోనూ చెప్పవద్దని ఆమెను బతిమాలాడు.

అయితే ఈ విషయం తెలిసి షాకైన తల్లిదండ్రులు వెంటనే వరుడి ఇంటికి చేరుకుని తమ కూతుర్ని తమవెంట తీసుకెళ్లారు. ఈ ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా పినపాడు కు చెందిన ఓ యువతిని విజయవాడకు చెందిన యువకుడితో ఏప్రిల్ 4వ తేదీన వివాహం జరిపించారు. తొలిరాత్రి సందర్భంగా ఆ యువతి ఎన్నో ఆశలతో గదిలోకి అడుగు పెట్టింది. కానీ అంతలోనే వరుడు అసలు నిజం బయట పెట్టడంతో షాక్ అయ్యింది.

తాను ఒక నపుంసకుడుని అంటూ యువకుడు నిజం చెప్పేశాడు. దీంతో యువతి ఈ విషయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఇక వెంటనే వరుడి ఇంటికి చేరుకున్న యువతి తల్లిదండ్రులు వారితో వాగ్వాదానికి తమ కూతురిని తమవెంట తీసుకెళ్లారు. అంతేకాకుండా రిసెప్షన్కు ఎనిమిది లక్షల ఖర్చు అయ్యిందని చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *