బికినీ ధరించిన మొదటి హీరోయిన్, చివరి రోజుల్లో ఆమె కష్టాలు వింటే కన్నీళ్లు రావడం ఖాయం.
దక్షిణ భారత చలనచిత్ర రంగానికి అందించిన విశేష కృషికి గాను కలైమామణి డాక్టర్ కె.నళినికి జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళామణులకు పక్వాన్ చెన్నై ఆధ్వర్యంలో రియలిస్టిక్ అవార్డ్స్ 2022లో భాగంగా మార్చి 1న ప్రదానోత్సవంలో నళిని జీవిత సాఫల్య పురస్కారం అందుకుంది. అయితే 1950వ దశకంలో, ఫిల్మ్‌ఫేర్ నిర్వహించిన ఒక పోల్‌లో అత్యంత అందమైన మహిళగా ఆమె ఎంపికైంది. దిలీప్ కుమార్ వంటి స్టార్ హీరో కూడా తనతో పాటుగా కలిసి పనిచేసిన వారిలో గొప్ప నటి నళిని జయవంత్ అని ప్రశంసించారు.
బాలీవుడ్ నివేదికల ప్రకారం, బికినీ ధరించిన మొదటి నటి నళిని జయవంత్ అని ఉంది. ఆమె ఇండియన్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, దర్శకురాలు అయిన శోభనా సమర్థ్‌కు మొదటి కోడలు. 1950లో విడుదలైన సంగ్రామ్ చిత్రంలో నళిని జయవంత్ స్విమ్ సూట్ ధరించారు. అప్పట్లో ఆమె బికినీ ఫోటోలు ప్రేక్షకులను షాక్ గురిచేశాయి. ఈ చిత్రంలో అశోక్ కుమార్ సరసన నళిని జతకట్టింది. ఫిల్మ్‌ఫేర్ నివేదికల ప్రకారం ఆవారా (1951)లో నర్గీస్ స్విమ్ సూట్ ధరించింది.
ఆ తర్వాత శోభనా సమర్థ్ కుమార్తె అయిన ‘నూతన్’ కూడా ‘డిల్లీ కా థగ్’ (1958) చిత్రంలో స్విమ్‌సూట్‌ను ధరించి మెప్పించారు. ఆ ఒక్క సినిమాతో నూతన్‌కు కూడ భారీ అవకాశాలు వచ్చాయి. అలా నూతన్, నళిని జయవంత్ ఒకే కుటుంబం నుంచి ఇద్దరూ బాలీవుడ్‌నే ఏలేశారు. నూతన్ సోదరి అయిన తనూజ కూతురే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్. నళినీ మరణించిన మూడు రోజులకు..నళినీ జయవంత్ డిసెంబర్ 22, 2010న 84 ఏళ్ల వయసులో ముంబైలోని చెంబూర్ వద్ద ఉన్న యూనియన్ పార్క్‌లోని తన బంగ్లాలో 60 ఏళ్లుగా జీవించి కన్నుమూశారు.
ఆమె మరణించిన మూడు రోజుల తర్వాత ఆమె మరణించినట్లు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ వచ్చే వరకు కూడా నళినీ చనిపోయినట్లు ఎవరూ గమనించబడలేదు. దుర్వాసన రావడంతో గమనించిన ఒకరు సమాచారం ఇవ్వడంతో ఆమె మరణ వార్త బయటి ప్రపంచానికి తెలిసింది. 2001లో తన భర్త ప్రభు దయాళ్ మరణించిన తర్వాత నళినీ పూర్తిగా తనను తాను ఒంటరిగా ఉండేలా బంధించుకుంది. అలా తొమ్మిదేళ్ల పాటు జీవించి దారుణమైన స్థితిలో కన్నుమూసింది. ఆమెకు పిల్లలు లేరు.
వృద్ధాప్యంలో బంధువులు కూడా ఆమె వద్దకు ఎవరూ రాకపోవడంతో ఒక అనాథలా తన జీవితాన్ని ముగించింది. 1941 నుంచి 1983 వరకు సుమారు 80కి పైగా చిత్రాల్లో నటించిన నళినీకి 2005లో దాదాహెబ్ ఫాల్కే అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారం దక్కింది.