బిగ్‌బాస్ 13 వారాలకు ఫైమాకు రెమ్యూనిరేషన్ అంతేనా..?
ఫన్ అండ్ గేమ్ రెండూ కలిపి కొట్టే ఫైమా ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌజ్‌లో కాస్తా సందడి తగ్గినట్లు కనిపిస్తోంది. 13వ వారం మొదటి నుంచి కీర్తి ఎలిమినేట్ అవుతుందనే అభిప్రాయలు వ్యక్తం అవగా అనూహ్యంగా ఫైమా బిగ్‌బాస్‌ను వీడింది. అయితే బిగ్ బాస్ 6 సీజన్ మొత్తంలో షాక్ ఏదైనా ఉంది ఉంటే ఈ నిన్న ఆదివారం ఫైమా ఎలిమినేట్ అవ్వడమే అని అంటున్నారు అభిమానులు.
కొన్ని కొన్ని టాస్కులు పక్కనపెడితే గేమ్ ఆడి, అందరిని నవ్వించిన కంటెస్టెంట్ గా ఫైమా మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఇక ఫైమా బయటకు రావడంతో అందరు షాక్ అయ్యారు. టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరిగా ఫైమా ఉంటుందని భావించారు. అయితే ఫైమా 13 వారాలకు అందుకున్న మొత్తం చాలా తక్కువ అని టాక్ నడుస్తోంది. బయట జబర్దస్త్ లో ఉన్నా ఆమె ఇంతకంటే ఎక్కువే సంపాదించేదని చెప్పుకొస్తున్నారు. వారానికి ఆమెకు రూ. 30 వేలు ఇచ్చారట.. ఆ లెక్కన 13 వారాలకు గాను ఆమె దాదాపు రూ. 3 లక్షల పై చిలికే అందుకున్నది అంట.
నిజం చెప్పాలంటే ఫైమాకు ఏది తక్కువ అమౌంట్ అని చెప్పాలి ఈ 13 వారాల్లో ఆమె జబర్దస్త్ అని, బయట ఈవెంట్స్ అని చేసినా ఎక్కువే వస్తాయి అంట. ఫైమా బిగ్ బాస్ కు వెళ్ళేటప్పుడే జబర్దస్త్ లో స్టార్ కమెడియన్. దీంతో ఆమె రెమ్యూనిరేషన్ కూడా బానే ఉండేదని టాక్. ఏదిఏమైనా కప్ కొట్టుకొని వస్తానని చెప్పిన ఫైమా అంతకు మించిన అభిమానులను సంపాదించుకొని వచ్చింది. మరి ఇకముందు ఫైమా జబర్దస్త్ లో కనిపిస్తుందో లేదో చూడాలి.