Life Style

ఈ చిట్కాలలో ముఖంపై నల్లమచ్చలు వెంటనే తగ్గిపోతాయి.

ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం, కానీ మొటిమలు వచ్చిపోయిన తర్వాత నల్లమచ్చలు ఒక సమస్యగా తయారవుతాయి. మొటిమలను గోటితో తొలగించినప్పుడు, చర్మంపై తరచుగా నల్ల మచ్చలు ఏర్పడతాయి. అయితే ముఖంపై మచ్చలను తొలగించుకోవాలంటే ఆరెంజ్ తొక్క పొడి చాలా ఉపయోగపడుతుంది. ఒక టీ స్పూన్ ఆరెంజ్ తొక్క పొడిని తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల పెరుగు వేసి కలపండి.

ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ముప్పై నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగేయండి. దీంతో మీ ముఖంపై ముడతలు తొలగిపోయి చక్కని చర్మం నిగనిగలాడుతుంది. నల్లని మచ్చలను దూరం చేస్తుంది. ఈ పొడికి ఇంతటి మహత్తర శక్తి ఉంది. అందుకే వైద్య నిపుణులు దీన్ని ఉపయోగించుకోవాలని చెబుతుంటారు. బొప్పాయి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, విటమిన్ ఎ, పెఫైన్ ఎంజైమ్ లు ముఖం మీద ఉండే మృత కణాలు తొలగిస్తాయి. బొప్పాయి ముఖంపై నల్లటి మచ్చలను తొలగించేందుకు సాయపడుతుంది.

ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. బొప్పాయి ముక్కను తీసుకుని సన్నగా తరిగి అందులో ఒక టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. దీన్ని ముఖంపై రాసుకుని ముప్పై నిమిషాల తరువాత కడుక్కుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ముఖంపై మచ్చలు తొలగించేందుకు కలబంద కూడా తోడ్పడుతుంది. ఇది ఎన్నో రకాల సమస్యలను తొలగిస్తుంది. మొటిమలు తొలగించడంలో కలబంద గుజ్జు పని చేస్తుంది. కలబంద గుజ్జును ముఖంపై రాసుకుని అరగంట తరువాత కడిగేస్తే మచ్చలు మాయమవుతాయి.

శనగపిండి కూడా మచ్చలను దూరం చేస్తుంది. ఒక టీ స్పూన్ శనగపిండి తీసుకుని అందులో అర టిస్పూన్ పసుపు, అర టీ స్పూన్ పాలు పోసి బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగేస్తే మొటిమలు, మచ్చలు పోతాయి. ఒక టీ స్పూన్ తేనె తీసుకుని అందులో ఒక టీ స్పూన్ శనగ పిండి తీసుకుని ముఖంపై రాసుకుని ఇరవై నిమిషాల తరువాత కడుక్కుంటే ముఖం నీట్ గా అవుతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల ముఖంపై ఉండే నల్ల మచ్చలు మాయమవుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker