Health

మీ కన్ను ఇలా మారుతుందా..? వామ్మో అది క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు.

శరీర భాగాలే కాకుండా కళ్ళు అదరడం కూడా సంకేతమని గ్రంధాలలో చెప్పబడింది. కళ్లు అదరడం అనేది ఎల్లప్పుడూ అశుభం కానవసరం లేదు.. కొన్నిసార్లు కళ్లు అదరడం శుభవార్తకు సంకేతమని పండితులు అంటుంటారు. అయితే ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య.. క్యాన్సర్. వయస్సులో సంబంధం లేకుండా ఈ మహమ్మారి జనాలను అటాక్ చేస్తోంది. ప్రస్తుతం అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ… సమయానికి గుర్తించపోతే..

ప్రాణాలను హరించేస్తుంది ఈ డిసీజ్. క్యాన్సర్ కణాలు శరీరంలో ఎక్కడైనా పెరగొచ్చు. అరుదైన క్యాన్సర్లలో కంటి క్యాన్సర్ కూడా ఒకటి. దీని ప్రారంభ లక్షణాలను గుర్తించి.. అప్రమత్తమైతే వ్యాధిని జయించవచ్చు. కంటి క్యాన్సర్ లక్షణాలు:- కంటిలో తెల్లటి ప్రతిబింబం కనిపిస్తుంది, చూస్తున్నప్పుడు కంప్లీట్ దృశ్యం స్పష్టంగా కనబడకుండా,

కొంతమేరకు చీకటిగా ఉంటుంది, దృష్టి అస్పష్టంగా మారుతుంది, ప్రతిదీ రెండుగా కనిపిస్తుంది, కనురెప్ప కింద చిన్న గడ్డల్లాగా తగులుతున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి, కనురెప్పల మీద చిన్న ఎర్రటి పూతలు వచ్చినా అశ్రద్ధ చేయవద్దు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోతుంటే డాక్టర్‌ను కన్సల్ట్ అవ్వండి, కనురెప్పల్లో ఇన్ఫెక్షన్, తరచుగా కంటి చివరన చిన్న చిన్న మెరుపులు (లైట్ ఫ్లాష్)లు, కంటి నొప్పి దీర్ఘకాలం ఉన్నా,

ఉబ్బినట్టు అనిపించినా, కన్నీళ్ళల్లో రక్తపు బొట్లు వస్తున్నా, కంటిలో నల్లగుడ్డు స్థానం మారినా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లండి, కంటి క్యాన్సర్ ఎక్కువగా వయస్సు పైబడిన వారిలో వస్తూ ఉంటుంది. అలా అని తక్కువ వయస్సు వారికి రాకూడదని లేదు. అలాగే వారసత్వంగా కూడా ఇది వచ్చే చాన్స్ ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker