Health

ఈ చిట్కాలలో కంటి చూపు వేగంగా పెరిగి మీ కళ్లద్దాలతో పనే ఉండదు.

సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెబుతారు. అంటే మన శరీరంలోని ఇంద్రియాలన్నింటిలో కళ్లు చాలా ప్రధానమైనవి అని అర్థం. కంటి చూపు మెరుగ్గా ఉన్నప్పుడే ప్రపంచాన్ని చూడవచ్చు. కానీ ఈరోజుల్లో చాలా మందికి కంప్యూటర్ స్క్రీన్ లు చూడటమే ప్రపంచం అయిపోయింది. పెరిగిన ‘స్క్రీన్ టీమ్’ మీ కంటి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు లేదా సెల్ ఫోన్‌లను విపరీతంగా ఉపయోగించడం వల్ల కంటి చూపు సమస్యలు వస్తాయి.

అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. కొంతమంది మంచి ఆహారం తీసుకుంటూ ఉంటారు. అంటే అన్ని విటమిన్స్ శరీరానికి అదే విధంగా ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటారు.అయిన సరే కంటి సంబంధిత సమస్యలతో బాధపడడం మనం చూస్తూ ఉంటాం.. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వంశపారంపర్యంగా కంటి సమస్యలు రావడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాళ్ళకి పని తక్కువ కళ్ళకి పని ఎక్కువైపోయింది.

అంటే చాలా వరకు లేవకుండా కళ్ళు అప్పగించి అలా పని చేస్తూ ఉండటం వల్ల కూడా కంటి సంబంధిత సమస్యలు ఎక్కువ మందికి వస్తున్నాయి. మరి ఇటువంటి కంటి సమస్యకు మీకు ఉపయోగపడే మీరు తయారు చేసుకోగలిగే సింపుల్ రెమెడీస్ మీతో షేర్ చేయబోతున్నాము.. మీ కంటి చూపుని తిరిగి మీరు కాపాడుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక వంద గ్రాముల వరకు బాదం గింజలను రాత్రి నానబెట్టండి.

ఉదయాన్నే వాటిని పొట్టు తీసి ఎండలు బాగా ఆరనివ్వండి. అలా ఆరిన బాదంని మెత్తగా గ్రైండ్ చేసి ఓ పక్కన ఉంచండి. అలాగే సోంపు అని గ్రీన్ కలర్ లో మనకి దొరుకుతుంది కదా.. సూపర్ మార్కెట్లో వాటిని తీసుకొచ్చి ఒక 100 గ్రాముల వరకు తీసుకుని వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఇప్పుడు ఈ రెండింటిలో పట్టిక బెల్లాన్నియాడ్ చేయాలి. అంటే చిన్న చిన్న పలుకులుగా ఉండే పట్టిక బెల్లం కాకుండా ముద్దలా ఉంటుంది కదా దానికి దారం కూడా ఉంటే మంచి ఔషధ గుణాలుంటాయి.

అటువంటి దాన్ని తెచ్చుకుని ముందుగా కచ్చాపచ్చాగా దంచి ఇప్పుడు బాదంపొడి ఈ పట్టిక మూడింటిని కలిపి మరొకసారి మిక్సీ పట్టండి. మెత్తగా పొడి చేసుకున్న దాన్ని గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకుని ప్రతిరోజు ఒక చిన్న గ్లాస్ పాలలో ఒక స్పూన్ ఈ పౌడర్ వేసి చిన్న పిల్లలకు పెద్దలకు ఇస్తే కంటి సంబంధిత సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ బాదంపాలు బాగా ఉపయోగపడతాయి. ఇటువంటి పాటిస్తూనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసులు ధరించడం ఎక్కువ వెలుతురును నేరుగా చూడకుండా జాగ్రత్త పడాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker