ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ కంటి చూపు అమాంతం పెరుగుతుంది.
సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెబుతారు. అంటే మన శరీరంలోని ఇంద్రియాలన్నింటిలో కళ్లు చాలా ప్రధానమైనవి అని అర్థం. కంటి చూపు మెరుగ్గా ఉన్నప్పుడే ప్రపంచాన్ని చూడవచ్చు. కానీ ఈరోజుల్లో చాలా మందికి కంప్యూటర్ స్క్రీన్ లు చూడటమే ప్రపంచం అయిపోయింది. పెరిగిన ‘స్క్రీన్ టీమ్’ మీ కంటి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు లేదా సెల్ ఫోన్‌లను విపరీతంగా ఉపయోగించడం వల్ల కంటి చూపు సమస్యలు వస్తాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో నేడు అధిక శాతం మంది ఎదుర్కొంటున్న ప్రధాన అనారోగ్య సమస్యల్లో నేత్ర సంబంధమైనవి కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.
ఈ రోజుల్లో అప్పుడే పుట్టిన శిశువుల్లో కూడా ఈ సమస్య ఎదురవడం సర్వ సాధారణమైపోయింది. ఇక యువత, పెద్దల్లో అధిక శాతం మంది చిన్న వయస్సులోనే కంటి అద్దాలు, కాంటక్ట్ లెన్స్‌లు ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు నేత్ర సంరక్షణపై దృష్టి సారించాల్సి వస్తోంది. అయితే కింద ఇచ్చిన పలు సహజ సిద్ధమైన టిప్స్‌ను పాటిస్తే నేత్ర సంబంధ సమస్య ఏదైనా సులభంగా దూరమవుతుంది. రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే దృష్టి సంబంధ సమస్యలు వెంటనే దూరమవుతాయి.
క్యారెట్లలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి నేత్ర సంబంధ సమస్యలను పరిష్కరిస్తాయి. చూపు స్పష్టతను పెంచుతాయి. నేటి తరుణంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల వాడకం ఎక్కువైంది. దీనికి తోడు బయట తిరగడం, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఆ ప్రభావం కళ్లపై కూడా పడుతుంది. రోజూ కనీసం 3 గంటల పాటు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకుంటే ఈ ఒత్తిడి నుంచి సులభంగా బయటపడవచ్చు.
రోజులో కొంత సమయం పాటు ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతిని చూడండి. ఇలా చేయడం వల్ల కళ్లకు ఎంతగానో హాయి కలుగుతుంది. ఇది నేత్రాలకు పూర్తి స్థాయిలో హాయినిస్తుంది. కంటి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువగా ధరించే వారు రోజులో కొంత సమయం పాటు వాటికి దూరంగా ఉండేందుకు యత్నించండి. దీని వల్ల లెన్స్‌ల ద్వారా కళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుంది. కంప్యూటర్లపై ఎక్కువగా పనిచేసేవారు అవసరమైతేనే వాటిని వాడాలి. లేదంటే దూరంగా ఉండాలి.
వీలైనంత వరకు కంప్యూటర్ స్క్రీన్ల నుంచి దూరంగా ఉండేందుకు యత్నించాలి. కళ్లను నిత్యం కొంత సమయం పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే కళ్లకు విశ్రాంతి కలుగుతుంది. రోజూ ఒక అరగంట పాటు గోరు వెచ్చని తడి గుడ్డతో కళ్లను సున్నితంగా ఒత్తినట్టు చేయాలి. ఇది కళ్లకు హాయినిస్తుంది. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల కంటి సమస్యలు పోతాయి. కంటి చూపు అమాంతం పెరుగుతుంది.