ఫోన్, ల్యాప్ టాప్ లను ఎక్కువ సేపు చూడడం వల్ల కళ్లు నొప్పి పెడుతున్నాయా..?
నేచర్కి విరుద్ధంగా జీవితం కావడంతో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇక కొత్త కొత్త ఫోన్ లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మొబైల్ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ నిద్ర లేచిన తర్వాత చూసేది మొబైల్ ఫోన్ నే. మొబైల్ లేకుండా మన రోజు గడవదు. ఉదయం కళ్లు తెరిచిన వెంటనే మొబైల్ చూస్తాం, రాత్రి పడుకునే ముందు కూడా మొబైల్ తోనే సావాసం.
ఇలా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ మొబైల్ ఫోన్ మనకు సమస్తం అయిపోతుంది. అయితే దీనివల్లే ఎన్నో కంటి సమస్యలు వస్తున్నాయి. ఎలకా్ట్రనిక్ గాడ్జెట్లను మితిమీరి వాడటం వల్ల కళ్లు బలహీనపడతాయి. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో కంటి సమస్యలు వస్తాయి. ఫోన్లు లేదా ల్యాప్టాప్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్ల నొప్పి వస్తుంది.
కీరదోసకాయ.. మొబైల్ డివైజ్ లు, ల్యాప్ టాప్ లలో ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్లలో నొప్పి వస్తుంటే.. కీరదోసకాయ ఈ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. నొప్పిని తగ్గించుకోవాలంటే కీరదోసకాయ ముక్కలను కట్ చేసి కళ్లపై 20 నిమిషాల పాటు పెట్టండి. ఇది కాకుండా కీరదోసకాయను తురిమి మీ కళ్లపై పెట్టండి. కీరదోసకాయలను ఉపయోగించడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
రోజ్ వాటర్.. రోజ్ వాటర్ కూడా కళ్లకు మేలు చేస్తుంది. రోజ్ వాటర్ కంటి నొప్పిని, చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం 2 నుంచి 3 చుక్కల రోజ్ వాటర్ ను కళ్లలో వేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. కళ్లలో దురద సమస్యకు కూడా రోజ్ వాటర్ ప్రయోజనకరంగా ఉంటుంది.
బంగాళాదుంపలు.. కీరదోసకాయల మాదిరిగానే బంగాళాదుంపలు కూడా కంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం ముందుగా బంగాళాదుంప ముక్కలను కట్ చేసి ఫ్రిజ్ లో 20 నిమిషాలు పెట్టండి. ఆ తర్వాత చల్లటి ముక్కలను మీ కళ్లపై పెట్టుకోండి. దీని వాడకం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.