రోజు ఇలా ఎక్సర్సైజ్ చేస్తే నెల రోజుల్లో మీ బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది.
ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల శరీరంలో అనేక వ్యాధులు ఎటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. బరువు పెరగడం, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలన్నీ మనిషిని చాలా బలహీనంగా మారుస్తాయి. అయితే, బరువు పెరగడం వల్ల నేటి కాలంలో చాలా మంది ఈ సమస్యతో పోరాడుతున్నారు. చాలా మంది తమ బొడ్డు కొవ్వుతో అంటే బెల్లీ ఫ్యాట్‌తో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బెల్లీ ఫ్యాట్ వల్ల గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అయితే ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీని కారణంగా నిద్రలేమి సమస్యలు, బెల్లీ ఫ్యాట్, శరీర బరువు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ప్రాణాంతకంగానూ మారే ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు జీవన శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
ప్రతి రోజూ యోగా చేయడం వల్ల బరువు తగ్గడమేకాకుండా చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుందననిపుణులు చెబుతున్నారు. ఇలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది.
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి వ్యాయామాలు.. బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడానికి వ్యాయామం చేయడమేకాకుండా.. క్రంచెస్, ఫ్లట్టర్ కిక్స్ వంటి కొత్త కొత్త ఫోజుల్లో చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన మెండి కొవ్వులు కూడా సులభంగా తగ్గుతాయి.
అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఫ్లట్టర్ కిక్స్.. దీన్ని చేయడానికి ముందుగా చాపపై నేరుగా వెనుకవైపు పడుకోండి. అప్పుడు మీ పాదాలను ఒకదానితో ఒకటి ఉంచి, వాటిని ముందు పైకి కదిలించండి. ఇప్పుడు మీ కడుపుని బిగించి.. మీ పాదాలను నేల నుంచి ఎత్తండి, ఆ తర్వాత కాళ్ళను పైకి క్రిందికి తరలించడం ప్రారంభించండి. ఇలా ప్రతి రోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.