Health

వంధ్యత్వం గురించి ప్రజల్లో ఉన్న ఈ అపోహలను అస్సలు నమ్మకండి, ఎందుకంటే..?

ఆడ వారికి ఇంట్లో అత్త మామ‌ల ద‌గ్గ‌రి నుండి ప‌క్కింటి ఆవిడ వ‌ర‌కు విశేషం లేదా లేదా అంటూ బాద‌పెడుతుంటారు. పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డం కేవ‌లం ఆడ‌వారి త‌ప్పే అన్న‌ట్లుగా దెప్పి పొడుస్తుంటారు. కొన్ని పరిశోధనల ప్రకారం, ఈ కేసులలో మూడింట ఒక వంతు పురుషుల వంధ్యత్వానికి కారణం. వంధ్యత్వం అనేది కేవలం మహిళలకు సంబంధించినది కాదు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతన్నారు. ఏండ్ల తరబడి ప్రయత్నించినా గర్భం దాల్చిన మహిళలు ఉన్నారు. నిజానికి వంధ్యత్వం ఒక మిస్టరీగా మారింది.

అంటే దీనిగురించి ఎవ్వరూ కూడా బహిరంగంగా మాట్లాడరు. అందులోనూ దంపతులు ఈ విషయంపై హాస్పటల్ కు వెళ్లడానికి సంకోచిస్తారు. దీంతోనే అసలు సమస్య ఏంటో వెంటనే బయటపడదు. సంతానలేమిపై ఎన్నో అపోహలు పుట్టుకొచ్చాయి. వంధ్యత్వానికి కారణాలు.. మహిళల సంతానోత్పత్తి వయస్సుతో పాటుగా క్రమంగా క్షీణించడం ప్రారంభిస్తుంది, ముఖ్యంగా 30 ఏండ్ల వయసులోనే ఇది మొదలవుతుంది. ఈ సమస్య పురుషులకు కూడా ఉంటుంది. నాణ్యమైన స్పెర్మ్ లేకపోవడం, వయస్సుతో పాటుగా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వల్ల సంతానోత్పత్తి దెబ్బతింటుంది. భాగస్వామికి స్మోకింగ్ తో పాటుగా పొగాకు అలవాటు ఉంటే కూడా గర్భం దాల్చడం కష్టమవుతుంది.

గంజాయి సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అలాగే మద్యపానం, అధిక బరువు లేదా తక్కువ బరువు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. వంధ్యత్వం సమస్య ఆడవాళ్లకే ఉంటుంది..వాస్తవం: నిపుణుల ప్రకారం.. వంధ్యత్వం సమస్య సాధారణంగా ఆడవాళ్లకు మాత్రమే వస్తుందనుకోవడం పెద్ద తప్పు. నిజమేంటంటే? వంధ్యత్వం స్త్రీ, పురుషులిద్దరి సమస్య కావొచ్చు. ఇది కేవలం మహిళల సమస్య మాత్రమే కాదు. వంధ్యత్వం లేదా వంధ్యత్వ కేసులలో మూడింట ఒక వంతు మగ సంతానోత్పత్తి సమస్యల వల్ల, మూడింట ఒక వంతు కేసులు స్త్రీ సంతానోత్పత్తి సమస్యల వల్ల సంభవిస్తాయి.

మూడింట ఒక వంతు కేసులు రెండు వైపులా లేదా తెలియని కారకాల వల్ల సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు స్ఖలనం చేయకపోతే తక్కువ వీర్యం.. వాస్తవం: నిపుణుల ప్రకారం.. నిజానికి మగ వంధ్యత్వాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. వంధ్యత్వం ఉన్న చాలా మంది పురుషులు సమస్య స్పష్టమైన సంకేతాలను చూపించరు. సాధారణంగా వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటమే దీనికి కారణమని జనాలు ఎక్కువగా నమ్ముతారు. స్పెర్మ్ చలనశీలత, ఆకారం కూడా దీనిలో పాత్ర పోషిస్తాయి.

శారీరకంగా కష్టపడే లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల మందులు తీసుకునే పురుషులకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక రక్తపోటు స్పెర్మ్ కౌంట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు నిపుణులు. వంధ్యత్వం యువతీయువకుల్లో రాకపోవచ్చు… వాస్తవం: వయస్సు పెరిగే కొద్దీ సంతానోత్పత్తి తగ్గుతుంది. 35 ఏండ్లు పైబడిన మహిళలు, 50 ఏండ్లు పైబడిన పురుషుల్లో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంటుంది. కానీ యువతీ యువకులు కూడా దీనితో ఇబ్బంది పడే అవకాశం ఉంది. 10 మంది మహిళల్లో ఒకరు 30 ఏండ్లకు చేరుకోకముందే వంధ్యత్వం సమస్యను ఫేస్ చేయొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker