Health

సాయంత్రం సమయంలో వ్యాయామం చేస్తే శరీరానికి ఎంత మంచిదో తెలుసుకోండి.

వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ. వ్యాయామం ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి, అధిక బరువు తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసం కొరకు చేస్తారు. అయితే రోజువారి వ్యాయామాలు ఏసమయంలో చేయాలన్న దానిపై సర్వత్రా చర్చ నిరంతరం ఉంటుంది. కొంతమంది ఫిట్‌నెస్ నిపుణులు ఉదయం పూట వ్యాయామాలు చేయటం ఉత్తమమని సిఫార్సు చేస్తుండగా మరికొందరు సాయంత్రం వర్కౌట్‌లు మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు.

ఒత్తిడి తగ్గించటానికి.. సాయంత్రం సమయంలో వ్యాయామాలు చేయటం వల్ల రోజంతా శరీరం ఎదుర్కొన్న ఒత్తిడి స్థాయిని తగ్గించుకోవచ్చు. సాయంత్రం వర్కౌట్‌లు ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా రాత్రి మంచి నిద్ర పట్టేలా చేస్తాయి. శరీర కండరాల్లో సడలింపు.. పగలంతా ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల శరీర కండరాలు గట్టిగా మారతాయి. సాయంత్రం సమయంలో వ్యాయామాలు చేయటం వల్ల టెన్షన్‌ను దూరంమై శరీరం తేలికగా మారుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరం నిద్రపట్టే సామర్థ్యాన్నికోల్పోతుంది.

సాయంత్రం సమయంలో మితమైన వ్యాయామం కండరాలకు రిలాక్సేషన్ ఇవ్వటం ద్వారా నిద్ర పట్టేలా చేస్తుంది. వ్యాయామం చేయడానికి ఎక్కువ సమయం కేటాయించవచ్చు.. పగలంతా పని కార్యకలాపాల వల్ల చాలా మందికి వ్యాయామాలు చేయటానికి సమయం కుదరదు. అయితే సాయంత్రం వేళ్ళల్లో వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించవచ్చు. ఆఫీసు కార్యకలాపాలు ముగించుకుని ఇంటికి వచ్చాకా వ్యాయామాలపై దృష్టిసారించవచ్చు.

మెరుగైన పనితీరుకు అవకాశం.. ఉదయం చేసే వ్యాయామాల కన్నా సాయంత్రం సమయంలోవ్యాయామాలను ఉత్సాహంగా చేసేందుకు అవకాశం ఉంటుంది. సాయంత్రం సమయంలో కార్యకలాపాలు అన్ని ముగియటం వల్ల ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఆసమయంలో వ్యాయామాలు చేయటం వల్ల తరువాతి రోజు పనిపై ఎక్కువ దృష్టి పెట్టటానికి అవకాశం ఉంటుంది. కొవ్వులను కరిగించటంలో.. 2022 అధ్యయనం ప్రకారం, సాయంత్రం వ్యాయామాలు పురుషులకు బాగా మేలు చేస్తాయి, ఎందుకంటే కొవ్వును కరిగించటంలో సహాయపడతాయి.

రక్తపోటు నియంత్రణను మెరుగుపరుస్తాయి. మహిళల్లో కండరాల పనితీరును పెంచుతాయి. వ్యాయామం మహిళల్లో పొత్తికడుపు కొవ్వు , రక్తపోటును తగ్గిస్తుంది. సాయంత్రం వ్యాయామం స్త్రీలలో కండరాల పనితీరును పెంచుతుంది. చివరిగా చెప్పాలంటే వ్యాయామాలు చేసేందుకు ఖచ్చితమైన సమయం ఏమీలేకపోయినప్పటికీ అనుకూలమైన సమయంపైనే అధారపడి ఉంటుంది. అయితే వ్యాయామాలు చేసే ముందు ఫిట్ నెస్ ట్రైనర్ ను సంప్రదించి సూచనలు సలహాలు తీసుకోవటం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker