సరదాగా సాయంత్రంపూట టీ తాగుతున్నారా..? ఈ విషయాలు మీకోసమే.
కొందరు రోజుకు కనీసం మూడు నుండి నాలుగు సార్లు టీ తాగుతారు. మీరు కూడా అలాంటివారైతే జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం ముందుగా ఒక కప్పు టీ తాగడానికి ఇష్టపడతాం. అదే సమయంలో అధికంగా టీ తాగేవారికి రోజుకు ప్రతి 2 నుండి 3 గంటలకు టీ అవసరం. అయితే టీ తాగడం తప్పు కాదు. కానీ పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది. టీ వ్యసనం ఒక చెడు వ్యసనం. ఎందుకంటే మీ అలసటను పోగొట్టే ఈ టీ మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అయితే మనలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది.
కొందరు రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం తాగుతుంటారు. మరికొందరైతే ఇష్టం వచ్చినట్లు తాగుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓ పది టీలు తాగే వారు కూడా ఉన్నారు. వాస్తవానికి టీలో ప్రొటీన్లు ఉండవు. ఏ రకమైన బలం ఉండదు. భారతీయ జనాభాలో 64 శాతం మంది రోజు టీ తాగడానికి ఇష్టపడతారని సర్వేలు చెబుతున్నాయి. ఇందులో 30 శాతం మంది సాయంత్రం కూడా తాగుతున్నారు. టీ తాగడం వల్ల లాభాల కన్న నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. అయినా అదో వ్యసనంలా మారిపోయింది. కొందరికి టీ తాగనిదే కాలకృత్యాలు కూడా తీర్చుకునే అవకాశం ఉండదంటే అతిశయోక్తి కాదు.
టీ అంతలా పెనవేసుకుపోయింది మన జీవితంతో. దీంతో టీ తాగడం మూలంగా అనారోగ్య సమస్యలు సైతం వస్తాయి. సాయంత్రం పూట టీ తాగితే మంచి నిద్రకు భంగం వాటిల్లుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం పడుకునే సమయానికంటే పది గంటల ముందే టీ తాగడం ఆపేయాలి. లేదంటే మన నిద్రపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఫలితంగా మనకు నిద్ర లేమి సమస్య వేధిస్తుంది. అయితే టీ తాగడం అంత అవసరమా? అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఏదో ఉదయం పూట తాగితే ఫర్వా లేదు. కానీ సాయంత్రం కూడా టీ తాగితే మనకు ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీ ఎవరు తాగొచ్చు.. రాత్రి పూట షిఫ్టుల్లో పనిచేసే వారు టీ తాగితే నష్టాలేవి ఉండవు.
ఎసిడిటి లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు లేని వారు కూడా తీసుకోవచ్చు. జీర్ణక్రియ సవ్యగా ఉన్న వారు కూడా తాగొచ్చు. టీ అలవాటు లేని వారు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. నిద్ర సమస్యలు లేని వారు కూడా సాయంత్రం పూట టీ తాగడం మంచిదే. సమయానికి భోజనం చేసేవారు కూడా టీ తాగాలి. ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు సాయంత్రం సమయాల్లో టీ తాగడం సురక్షితమే. వారు తాగినా ఎలాంటి నష్టం సంభవించదు. సాయంత్రం ఎవరు తాగొద్దు..నిద్రలేమి సమస్యతో బాధపడేవారు. ఒత్తిడితో నిరంతరం బాధలకు గురయ్యేవారు. పొడి చర్మం, జుట్టు ఉన్నవారు. బరువు పెరగాలనుకునే వారు.
ఆకలి లేని వ్యక్తులు. హార్మోన్ల సమస్యతో బాధపడేవారు. మలబద్ధకం సమస్య ఉన్నవారు జీర్ణక్రియ సక్రమంగా లేని వారు. ఆరోగ్యకరమైన జుట్లు కోరుకునే వారు సాయంత్రం సమయంలో టీ తాగడం మంచిది కాదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. దీనికి అందరు కట్టుబడి ఉంటే ప్రయోజనాలు దక్కుతాయి. టీలో పోషకాలు సున్నా.. సాయంత్రం సమయంలో టీ తాగడం మానుకోవాలి. లేదంటే పలు సమస్యలకు కేంద్రంగా మారాల్సి వస్తుంది. టీ లో ఎలాంటి పోషకాలు ఉండవు. కానీ దానికి అందరు ఆకర్షితులవుతున్నారు. గ్రీన్ టీ వంటిది తీసుకోవడం మూలంగా కొంత ఉపశమనం లభించనుంది. సాయంత్రం పూట టీ తాగితే నిద్రకు మాత్రం కచ్చితంగా భంగం కలగడం ఖాయం. ఖాళీ కడుపుతో టీ తాగితే ఆకలి అణిచివేస్తుంది. ఇలా టీ తాగడం వల్ల వచ్చే ఇబ్బందుల దృష్ట్యా మానుకోవడమే మంచిది.