ఇంట్లో ఈగల గోల ఎక్కువైందా..? రూపాయి ఖర్చు లేకుండా ఈగల మోతకు ఇలా చెక్ పెట్టండి.
ఈగలను తరిమికొట్టడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. మార్కెట్లో దొరికే రకరకాల స్ప్రేలను ఉపయోగిస్తుంటారు. అంతేనా ఈగలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేకంగా కొన్ని వస్తువులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న విషయాలు. అలాకాకుండా రూపాయి ఖర్చు లేకుండా మన వంటింట్లో ఉండే వస్తువులతో ఈగలను తరిమి కొట్టే అవకాశం ఉందని మీకు తెలుసా..! సాధారణంగా ఇంట్లో ఈగలు ముసరడం అనేది కామన్ విషయం.
ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ఈగలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. కారణం అది మామిడి పండ్ల సీజన్ కాబట్టి. మామిడి పండ్లు తింటూంటే ఈగలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. వేసవి కాలంలోనే ఈ ఈగలు అనేవి ఎక్కువగా ఇంట్లోకి చుట్టుముడతాయి. దీంతో ఫ్లోర్ ని, ఇంట్లో చెత్తా చెదారం లేకుండా ఎంత క్లీన్ చేసినా ఇవి కనిపిస్తూనే ఉంటాయి. వీటి వల్ల చిరాకు వచ్చేస్తుంది. అవి మనం తినే ఆహార పదార్థాలపై వాతూంటాయి. దీని వల్ల పలు రకాల ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.
ఎందుకంటే ఈగలు.. ఒక చోట ఉన్న బ్యాక్టీరియాను మరో చోటికి తీసుకొస్తాయి. కాబట్టి ఇవి ఉన్నప్పుడు ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోని కొన్ని కిచెన్ ఐటెమ్స్ తో ఈ ఈగల్ని తరిమికొట్టవచ్చు. కర్పూరం:- ఈగలు ఎక్కువగా ఉన్న చోట కర్పూరం వెలిగించి పెట్టండి. దీంతో ఈగలు పరార్ అవుతాయి. కర్పూరంలో ఘాటైన వాసన ఉంటుంది. ఈ వాసనకు ఈగలు దూరంగా వెళ్తాయి. దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో కూడా ఘాటు వాసన ఉంటుంది. ఈగలు ఎక్కువగా ఉన్న దాల్చిన చెక్క పొడి కానీ.. దాల్చిన చెక్కను కాని పెట్టండి.
దాల్చిన చెక్క ఎయిర్ రిఫ్రెషన్ గా యూజ్ చేవచ్చు. ఈ వాసనకు ఈగలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. యాపిల్ సైడర్ వెనిగర్:-యాపిల్ సైడర్ వెనిగర్ లో ఘాటు వాసనలు ఉంటాయన్న విషయం తెలిసిందే. దీన్ని ఆరోగ్యం కోసమే కాకుండా.. ఇలా చిట్కాగా కూడా ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ చిన్న బౌల్ లోకి తీసుకుని.. ఒక మూల పెట్టండి. ఈ వాసనకు ఈగలు బయటకు పారిపోతాయి. గ్రీన్ యాపిల్ సోప్:-గ్రీన్ యాపిల్ సబ్బు కూడా ఈగలను తరిమికొట్టేందుకు బాగా ఉపయోగ పడుతుంది.
చిన్న బౌల్ లో రెండు టీ స్పూన్ల గ్రీన్ యాపిల్ సోప్ లిక్విడ్ ని తీసుకోవాలి. అందులో కొద్దిగా నీటిని కలిపి.. ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉన్నచోట ఓ మూలన ఉంచాలి. ఈ సోప్ ఘాటు వాసనకు ఈగలు అటు వైపు రావు. తులసి:- తులసి ఆకులను ఆరోగ్య పరంగా, ఆధ్యాత్మికంగానే కాకుండా ఇలా ఇంటి చిట్కాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. తులసి మొక్కతో దోమల బెడదనే కాకుండా ఈగల బెడద నుంచి కూడా తప్పించుకోవచ్చు. పుదీనా, లావెండర్ వంటి మొక్కలు కూడా ఈగలను తరిమికొడతాయి.