News

మీ దగ్గర ఎలక్ట్రిక్ బైక్‌ ఉంటె జాగర్త, ఛార్జింగ్ పెడితే బాంబులా పేలిన బైక్‌.

కేవలం ఛార్జింగ్ పెడితే చాలు. మళ్లీ అది ఛార్జింగ్ అయిపోయంత వరకు వాడుకోవచ్చు. ఇంత మంచి సదుపాయం కలిగిన ఈ ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి ఇప్పుడు ప్రతిఒక్కరి దగ్గర ఉన్నాయి. ఇటీవల కాలంలో వీటి వలన అనేక ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పెట్రోల్ తో నడిచే వాహనాలపై ఆసక్తి తగ్గించి.. ఎలక్ట్రికల్ బైక్ లపై మోజు పెంచుకుంటున్నారు. అంతా సాఫీగా సాగితే ఓకే.. కానీ వాటి వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తేనే.. గుండెలు పట్టుకోక తప్పదు.

విశాఖలో తాజా జరిగిన ఘటన స్థానికులను పరుగులు పెట్టించింది. విశాఖ.. 90 వార్డు బుచ్చిరాజుపాలెం సీతారామరాజు నగర్ లో అపూర్వ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అపూర్వ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో ఉంటున్న సంతోష్ కుమార్.. భవనం సెల్లార్లో తన బ్యాటరీ టూ వీలర్ ( ఎలక్ట్రిక్) వాహనం చార్జింగ్ పెట్టాడు.

చార్జింగ్ జరుగుతుండగా ఎవరి పనుల్లో వారు ఉన్నారు. రెండు గంటలు గడిచింది. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు.. మర్రిపాలెం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు లోనికి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం దాటికి పక్కనే ఉన్న మీటర్లు కూడా కాలిపోయాయి.

దీంతో ఆ భవనం నుంచి జనమంతా బయటకు వచ్చేసారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ ప్రమాద తీవ్రత, మంటలకు భయపడి భారీగా గుమి గూడారు. ఎట్టకేలకు మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బైక్ పూర్తిగా దగ్ధం అయిపోయింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker