ఉత్థాన ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేస్తే.. మీ ఇంట్లో డబ్బులు లోటు ఉండదు.
ఏకాదశి శ్రీ హరివిష్ణువుకు అంకితం చేసినది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశి నుంచి ఉపవాసం ఉండటం ఆరంభమైనదని కొందరు చెబుతారు. అయితే హిందూ మతంలో ఉత్థాన ఏకాదశిని లేదా ప్రబోధిని ఏకాదశి ఉపవాసం చాలా పవిత్రమైనది. ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఎందుకంటే ఈ రోజున శ్రీ మహా విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు.
దీంతో 4 నెలల తర్వాత నుంచి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటి శుభ కార్యాలు ప్రారంభమవుతాయి. ఉత్థాన ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఉపవాసం పాటిస్తారు. వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఉత్థాన ఏకాదశి నవంబర్ 12 న వచ్చింది. ఉత్థాన ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. ఉత్థాన ఏకాదశి నుండి వివాహాలు ప్రారంభమవుతాయి.
మర్నాడు అంటే ద్వాదశి రోజున తులసి వివాహాన్ని జరిపిస్తారు. ఉత్థాన ఏకాదశి రోజున చేసే దానధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున దానధర్మాలు, పుణ్యకార్యాలు చేసేవారి ఇంట్లో ధన, ధాన్యాలకు లోటుండదని, సుఖ సంతోషాలకు, ఐశ్వర్యానికి లోటుండదని నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిధి నవంబర్ 11 సాయంత్రం 6.46 గంటలకు ప్రారంభమవుతుంది.
అదే సమయంలో ఈ ఏకాదశి తిధి నవంబర్ 12 సాయంత్రం 4:04 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉత్థాన ఏకాదశి ఉపవాసం నవంబర్ 12 న చేయనున్నారు. ఉత్థాన ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు పారణ సమయం ప్రకారం పారణ చేయాలి. ఎందుకంటే పారణానంతరం మాత్రమే ఉపవాసం పూర్తి ఫలితాలు లభిస్తాయని నమ్మకం.