పచ్చి కూరగాయలు తినే అలవాటు ఉందా..? మీకు అసలు విషయం తెలిస్తే..?
పచ్చి కూరగాయలు అలాగే పచ్చి పండ్లలో ఏదో ఒకటి ఆహారంగా తీసుకుంటుండాలని, వీటిని తీసుకోవడంతో జీర్ణక్రియలో సహాయకారిగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పచ్చి కూరగాయలు, పచ్చి పండ్లు తీసుకోవడంతో శరీరానికి ఎలాంటి హానీ కలగదని వైద్యులు తెలిపారు. అయితే డైట్ ప్రాక్టీషనర్లు కూడా పచ్చివే తినండి అని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే… ఏదైనా ఫుడ్‌ని వేడి చేస్తే… అందులో పోషకాలు తగ్గిపోతాయన్న ఆలోచనే ఇలా చేయడానికి కారణం.
ఇలా పచ్చిగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాదు, రాన్రానూ తీవ్రమైన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందన్న వాదన ఇప్పుడు తెరపైకి వస్తోంది.వేడిగా ఉండే ఆహారం,పొట్టలో రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వండిన ఆహారం పొట్టలో తేలిగ్గా ముక్కలవుతుంది. పోషకాలు అన్ని ఒక క్రమపద్ధతిలో, శరీరంలో కలుస్తాయి. దీని గురించి లోతుగా పరిశీలిస్తే ఆయుర్వేదమే కాదు… సైన్స్ కూడా అదే కరెక్ట్ అంటోంది.
పచ్చివి తినడం కంటే, వండినవి తినడం వలన, ఎక్కువ ప్రయోజనాలుంటాయని చాలా పరిశోధనల్లోకూడా తేలింది. ఆహారాన్ని నీటిలో ఉడకబెట్టడం వల్ల, ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ శరీరానికి అందుతాయి. అదేకాకుండా పచ్చి కూరగాయలు, పచ్చి ఆకుకూరలూ తింటే, జీర్ణం అవ్వడం కష్టం… అవి అటుతిరిగీ ఇటు తిరిగీ… మూత్రాశయాన్ని నాశనం చేస్తాయని సైన్సు చెబుతోంది. తేలిగ్గా జీర్ణం అయ్యేవి పచ్చివి తిన్నా పర్వాలేదేమో గానీ… వీలున్నంతవరకు వండుకు తింటేనే మంచిది. ఎండాకాలంతో పోల్చితే… శీతాకాలంలో జీర్ణ వ్యవస్థ అంత చురుకుగా ఉండదు.
అందువల్ల శీతాకాలంలో కచ్చితంగా ఆహారాన్ని వండుకొని తినడమే మంచిది .వర్షాకాలంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో పచ్చివి తినవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే,వానాకాలంలో బ్యాక్టీరియా, వైరస్ వంటివి యాక్టివ్‌గా ఉంటాయి. పచ్చిగా తినడం వలన అవి డైరెక్టుగా పొట్టలోకి వెళ్లి నివాసాన్ని ఏర్పరుచుకుంటాయి. అందువలన కూరగాయలు, ఆకు కూరల్ని బాగా కడికి, వండుకొని తినడమే మేలు. తద్వారా రోగాలూ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.