ఈ సమస్య ఉన్న వాళ్లు ఈ వంకాయలను గుర్తుపెట్టుకుని మరీ తినాలి. ఎందుకంటే..?
అందరికీ వంకాయ పడదు. స్కిన్ అలర్జీలతో బాధపడేవారు వంకాయలను దూరంగా ఉండటమే మంచిది. అలాంటప్పుడు వంకాయను ఎలా ఆరోగ్యకరమైన కాయగూర అంటారనేగా మీ సందేహం. ఎందుకంటే.. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ ఒక్క కారణం తప్పా.. మిగతా విషయాల్లో వంకాయ చాలా ఉత్తమమైనది. అతిగా కాకుండా వారానికి ఒక్కసారి వంకాయను ఆహారంగా తీసుకున్నా చాలు.
అయితే మన వంటింట్లో దొరికే కూరగాయలల్లో వంకాయ కూడా ఒకటి. కూరగాయలు మార్కెట్లో రెండు మూడు రకాలుగా మనకు లభిస్తూ ఉంటాయి. కొందరు వంకాయను అతిగా ఇష్టపడి తింటే మరికొందరు తినడానికి అంతగా ఇష్టపడరు. ఎక్కువ శాతం మంది వంకాయలు తినడానికి ఎంతగా ఇష్టపడరు. అందుకు కల కారణం వంకాయ తింటే నవ్వలు వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు.
చాలామంది ఎదుటి వ్యక్తి చెప్పిన మాటలను నమ్మేసి వంకాయను తినకుండా అలాగే ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వంకాయ వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వంకాయలో ఫైటోన్యూట్రియెంట్స్, విటమిన్ సి, ఫైబర్ వంటి లెక్కలేనన్ని పోషకాలు లభిస్తాయి. వంకాయ మన శరీరానికి మంచి పోషక విలువలను అందజేస్తుంది. వంకాయలోని ఫైటో న్యూట్రీషియన్స్ మన మెదడు పనితీరును పెంచడమే కాకుండా కణ త్వచాలను సురక్షితంగా ఉంచుతుంది.
అంతేకాకుండా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. వంకాయలో ఐరన్,క్యాల్షియం పుష్కలంగా ఉండటం వలన ఎముకలు ఉంతటాయి. వీటిని రోజూ తింటే ఎముకలు బలంగా మారుతాయి. అలాగే క్యాన్సర్ నిరోధక లక్షణాలను నివారించడంలో వంకాయలో ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ,మాంగనీస్ పుష్కలంగా లభిసస్తాయి.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు అనేక సమస్యల నుండి కణాలను రక్షిస్తాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. వంకాయలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వంకాయ రక్తహీనతను నివారిస్తుంది. అలాగే మనం రెగ్యులర్గా ఆహారంలో చేర్చుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఇది శరీరాన్ని అలసట లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి వంకాయల వల్ల కేవలం అనారోగ్య సమస్యలు మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.