Health

ఈ నేచుర‌ల్ యాంటీ బ‌యోటిక్ ప‌దార్థాలు తింటే విష జ్వ‌రాలు రానేరావు.

జబ్బు చేస్తే శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎందుకంటే వ్యాధితో పోరాడటానికి శరీరంలో హెచ్చు ఉష్ణోగ్రత మేలు చేస్తుంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు శరీరంలో విడుదలయ్యే హార్మోనులు, ఎంజైములు లాంటి రసాయనాల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇవి వ్యాధితో పోరాటానికి పనికి వస్తాయి. అయితే మ‌న ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ధంగా ల‌భించే కింద తెలిపిన నేచుర‌ల్ యాంటీ బ‌యోటిక్ ప‌దార్థాల‌ను కూడా వాడితే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఇంకా త్వ‌ర‌గా కోలుకుని, ప‌రిపూర్ణ ఆరోగ్య‌వంతులుగా మారేందుకు అవ‌కాశం ఉంటుంది. తేనె.. ఆయుర్వేద ప్ర‌కారం తేనెలో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి.

వ్యాధుల‌ను త‌గ్గించే గుణాలు కూడా పుష్క‌లంగానే ఉంటాయి. అంతేకాదు మ‌న శ‌రీరంలోని సూక్ష్మ క్రిముల‌ను నాశ‌నం చేసే శ‌క్తి తేనెకు ఉంటుంది. అందుక‌ని ఇది స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌గా ప‌నిచేస్తుంది. నిత్యం తేనెను ఆహారంలో భాగం చేసుకుంటే చాలు.. మ‌న శ‌రీరంలో ఉండే క్రిములు న‌శిస్తాయి. అనారోగ్య స‌మ‌స్య‌లు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. అలాగే గాయాలు, పుండ్ల‌పై కూడా తేనెను రాస్తే అవి త్వ‌ర‌గా త‌గ్గుతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు త్వ‌ర‌గా న‌య‌మ‌వుతాయి. అయితే చ‌క్కెరకు బ‌దులుగా తేనెను వాడితే ఇంకా మెరుగైన ఫ‌లితం ఉంటుంది.

క‌నీసం ఒక టీస్పూన్ తేనెను నిత్యం నేరుగా తీసుకున్నా చాలు.. అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వెల్లుల్లి.. తేనెలాగే వెల్లుల్లి కూడా స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌లా ప‌నిచేస్తుంది. ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. వెల్లుల్లిలో ఉండే ఆల్లిసిన్ అనే సమ్మేళ‌నం మ‌న శ‌రీరంలో ఉండే హానికార‌క బాక్టీరియాను నాశ‌నం చేస్తుంది. వెల్లుల్లి రెబ్బ‌లు రెండింటిని నిత్యం రెండు పూట‌లా నేరుగా తిన్నా లేదా వాటిని నూనెలో రోస్ట్ చేసుకుని తిన్నా ఫ‌లితం ఉంటుంది.

అల్లం..అల్లంలో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. అల్లంలో ఉండే జింజెరాల్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం అనేక ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఇది వికారాన్ని తగ్గిస్తుంది. కండ‌రాల నొప్పుల‌ను పోగొడుతుంది. ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షిస్తుంది. వ్యాధులు త్వ‌ర‌గా న‌యం అయ్యేలా చేస్తుంది. ప‌సుపు..పసుపులో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే క‌ర్‌క్యుమిన్ అన‌బ‌డే ప‌దార్థం స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ‌ను అందిస్తుంది. అందువ‌ల్ల నిత్యం ప‌సుపును తీసుకుంటే రోగాల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. అనారోగ్య స‌మ‌స్య‌లను త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker