ఇలాంటి ఆహారం తరచూ తింటుంటే జీవితంలో పక్షవాతం రాదు.
ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి వారి జీవిత కాలంలో పక్షవాతం వస్తోంది. ప్రతి ఆరు సెకెండ్లకు ఒకరు పక్షవాతంతో మృతి చెందుతున్నారు. మన దేశంలోనూ ఈ వ్యాధి వల్ల రోజుకు రెండు వేల మంది చనిపోతున్నారు. కేవలం 10 శాతం మందికే పక్షవాతంపై అవగాహన ఉంది. దీని వల్ల సగానికి పైగా తమ పని కూడా చేసుకోలేనంతగా అంగవైకల్యానికి గురవుతున్నారు. పక్షవాతంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 29న వరల్డ్ స్ట్రోక్ డేను నిర్వహిస్తున్నారు. గతంలో ఈ వ్యాధి వృద్ధుల్లోనే కనిపించేది.
ప్రస్తుతం పక్షవాతం కేసుల్లో 25 నుంచి 30 శాతం వరకు చిన్నవయసు వారుంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి, ధూమపానం, మద్యపానం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవారికి పక్షవాతం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కళ్ళు తిరగటం, తాత్కాలికంగా దృష్టి మందగించడం, లేదా రెండుగా కనిపించడం, కాళ్ళూ, చేతులు ఉన్నట్లుండి బలహీనంగా అవడం, మాటల్లో తడబాటు వంటివన్నీ పక్షవాతానికి ముందస్తు సంకేతాలు.
అయితే ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల బాధ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏ వ్యాధి వచ్చినా భరించడం సాధ్యం అవుతుందేమో కానీ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కలిగే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారు పడే బాధ వర్ణణాతీతం. ఎంతటి మనిషినైనా బ్రెయిన్ స్ట్రోక్ అటు శారీరకంగా ఇటు మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. మన శరీరంలోని రక్తనాళాలలో అవరోధాలు ఏర్పడితే బ్రెయిన్ స్ట్రోక్ సమస్య వస్తుంది.
మెదడుకు జరిగే రక్త సరఫరాలో అంతరాయం కలిగితే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడతాం. గుండె జబ్బులు, మధుమేహం, రక్త పోటు, ఊబకాయం, పొగ త్రాగటం, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు బ్రెయిన్ స్ట్రోక్ కు ముఖ్య కారణాలు. ముఖం వేలాడిపోవడం, చేతుల్లో ఇబ్బంది, మాట్లాడటంలో ఇబ్బంది, సమతౌల్యం కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం, చూపు మందగించటం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు.
చాలా సందర్భాల్లో బ్రెయిన్ స్ట్రోక్ లాంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే మనిషి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మన డైట్ లో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. ప్రతిరోజూ పాలు, పెరుగు, జున్ను, పండ్లు మన ఆహారంలో భాగం కావాలి. కోడిగుడ్లు, కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో ఉండే ఫైబర్ బ్రెయిన్ స్ట్రోక్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.