తీపి ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వస్తుందా..? మీకు అసలు తెలిస్తే..?
షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహం అన్ని ఒకే వ్యాధి. ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇది. ఇది అత్యంత ప్రమాదకారి కానప్పటికీ.. షుగర్ మితిమీరితే ప్రాణాలకే ప్రమాదం. శరీరంలోని గ్లూకోజ్ హెచ్చు తగ్గుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ షుగర్ వ్యాధి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం సరైన డైట్ ఖచ్చితంగా పాటించాల్సిందే. అయితే తియ్యని తేనె, బెల్లం తీసుకుంటారా..? నో ప్రాబ్లం. ఎందుకంటే తీపి పదార్థాల కన్నా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే పనీర్, ఛీజ్, బర్గర్ల వంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటేనే డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ.
అయితే స్వీట్లలో నూనె పదార్థాలు కూడా ఉంటాయి కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లు వాటి జోలికి పోవద్దు. చక్కెర తిన్నంత మాత్రాన చక్కెర వ్యాధి వస్తుందనడం కరెక్ట్ కాదు. అదేవిధంగా చక్కెర తినకపోతే రాదనీ చెప్పలేం. చక్కెర వ్యాధికీ, తినే చక్కెరకీ సంబంధం లేదు. తీపి పదార్థాల కన్నా కొవ్వు పదార్థాలు తింటేనే డయాబెటిస్ వస్తుంది. అన్నం తినడం వల్లనే డయాబెటిస్ కంట్రోల్ కావడం లేదు అనే నమ్మకంతో ఉంటారు చాలామంది.
కానీ వందల ఏళ్లుగా తింటున్న అన్నం తింటున్నాం. కానీ డయాబెటిస్ మాత్రం ఇటీవలి కాలంలోనే పెరిగింది. కాబట్టి మనం తినే అన్నానికీ, రక్తంలో ఉండే చక్కెరకూ పెద్దగా సంబంధం లేదు. అయితే అన్నంతో పాటు నూనె పదార్థాలైన వేపుడు కూరలు, పిండివంటలు తీసుకుంటే మాత్రం కష్టమే. లో కార్బ్ డైట్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. పైగా ఆహారంలో పిండి పదార్థాన్ని తగ్గిస్తే ఆటోమేటిగ్గా కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటాం. దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కొవ్వు పదార్థాల వల్ల సమస్య గానీ పిండి పదార్థం వల్ల కాదు.
అందుకే అన్నం తినడం మానడం కరెక్ట్ కాదు. ఓట్స్ మన ప్రాంతానికి చెందిన పదార్థం కాదు. మన దగ్గర పండే పంటా కాదు. అది తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుందనడం అపోహ. పైగా అవి రక్తంలో గ్లూకోజ్ ను పెంచుతాయి. ఓట్స్ ను ప్రాసెస్ చేసి అమ్ముతారు కాబట్టి ఓట్స్ తిన్న వెంటనే గ్లూకోజ్ పెరుగుతుంది. అలా పాశ్చాత్య దేశాల్లోంచి వచ్చిన ఏ పదార్థాలు కూడా మన వాళ్ల డయాబెటిస్ ను తగ్గించలేవు. ఓట్స్ వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుందే గానీ తగ్గదు.