చక్కెర ఎక్కువగా తింటే నిజంగా షుగర్ వ్యాధి వస్తుందా..?
మధుమేహాన్ని నియంత్రించకపోతే గుండె జబ్బులు, కిడ్నీ, కంటి సమస్యలు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. మధుమేహాన్ని నియంత్రించడానికి, నిష్క్రియాత్మక జీవనశైలిని మెరుగుపరచడానికి.. ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఆహారాన్ని తీసుకోండి. అయితే మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండు టైప్ 2 డయాబెటీస్, ప్రీడయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ లు కూడా ఉన్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలు డయాబెటీస్ ను ప్రభావితం చేస్తాయి. మధుమేహం ప్రధాన లక్షణాలు ఇలా ఉంటాయి.. తరచుగా మూత్రవిసర్జన చేయడం. అస్వస్థతకు గురికావడం, తరచుగా దాహం వేయడం, దృష్టి సమస్యలు, గాయాలు తొందరగా మానకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గడం, తరచుగా ఇన్ఫెక్షన్లకు గురికావడం. అసలు డయాబెటీస్ గురించి అపోహలు, వాస్తవాలేంటో తెలుసుకుందాం పదండి.
చక్కెర తింటే డయాబెటీస్ వస్తుందా.. చాలా మంది ఈ విషయాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. చక్కెరను ఎక్కువ తింటే డయాబెటీస్ పక్కాగా వస్తుందని. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది పూర్తిగా అవాస్తవం. దీనిలో ఇంత కూడా నిజం లేదు. రక్తంలో షుగర్ లెవెల్స్ మధుమేహానికి కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ఇదే మధుహానికి ఖచ్చితమైన కారణం కాదు.
అవయవాలకు హాని కలుగుతుందా.. మధుమేహం వల్ల పూర్తిగా అంధత్వం లేదా అవయవాలకు హాని కలుగుతుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మీరు చాలా ఏండ్ల నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతుంటేనే అవయవాలు దెబ్బతినడం లేదా పూర్తిగా కోల్పోతారు. ఇది ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందు భయపడటం ఆపేయాలి.