Health

భోజనం చేశాక ఈ పనులు అస్సలు చేయకూడదు. చేస్తే చాలా ప్రమాదం.

భోజనం చేశాక కొన్ని ప‌నులు అస్సలు చేయ‌కూడ‌దు. దీనివ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్యలు త‌లెత్తే అవ‌కాశం ఉంది. తిన్న త‌ర్వాత ఈ ప‌నులు చేయొచ్చని కొంత‌మంది వాదిస్తుంటారు. వారు చెప్పేవి నిజ‌మో కాదో కూడా తెలుసుకోవ‌డానికి ప్రయ‌త్నించ‌రు. అయితే మ‌న‌లో చాలా మంది భోజ‌నం చేసిన వెంట‌నే అధికంగా నీరు తాగుతుంటారు. మరికొంద‌రు సిగరెట్‌ స్మోకింగ్ చేస్తారు. ఇంకొంద‌రు కూల్‌డ్రింక్స్‌, ఫ్రూట్‌ జ్యూసులు తాగుతుంటారు. ఇలా అనేక మంది భోజ‌నం చేశాక అనేక విధాలైన ప‌నులు చేస్తుంటారు.

అయితే నిజానికి మ‌నం భోజ‌నం చేశాక చేయ‌కూడ‌ని ప‌నులు కొన్ని ఉన్నాయి. ఈ అలవాట్ల వ‌ల్లనే మ‌న‌కు అరోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయి. భోజ‌నం చేశాక ఎట్టి ప‌రిస్థితిలోనూ స్మోకింగ్ చేయ‌కూడదు. అలా చేయడం వల్ల పొగాకులో ఉండే నికోటిన్ మ‌న శ‌రీరంలో జరిగే జీర్ణ క్రియ‌ను అడ్డుకుంటుంది. అలాగే శ‌రీరం క్యాన్సర్ క‌ణాల‌ను గ్రహించి క్యాన్సర్ వ్యాధి వ‌చ్చేలా చేస్తుంది. అందుకని భోజ‌నం చేశాక స్మోకింగ్‌ మంచిది కాదని గుర్తుంచుకోవాలి. భోజ‌నం చేసిన వెంట‌నే స్నానం కూడా చేయ‌రాదు. అలా చేయడం వలన జీర్ణప్రక్రియ‌కు ఆటంకం క‌లుగుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. దీంతోపాటు గ్యాస్‌, అసిడిటీ వ‌స్తాయి.

అయితే భోజ‌నం చేశాక స్నానం చేద్దామ‌నుకుంటే క‌నీసం 40 నిమిషాల వ‌ర‌కు ఆగితే మంచిది. దీంతో ఆరోగ్యంపై అంత ప్రభావం ప‌డ‌కుండా ఉంటుంది. చాలా మంది భోజ‌నం చేసిన వెంట‌నే ప‌లు ర‌కాల పండ్లను తీసుకుంటుంటారు. కానీ అలా చేయ‌కూడదు. మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం సరిగ్గా గ్రహించాలంటే పండ్లను తిన‌కుండా ఉండాలి. అయితే పండ్లను తినాలనుకుంటే భోజ‌నం చేశాక క‌నీసం 60 నిమిషాల వ్యవ‌ధి ఉండేలా చూసుకోవాలి. భోజనం చేశాక గ్రీన్ టీ తాగ‌రాదు.

తాగితే శ‌రీరం మ‌నం తిన్న ఆహారంలో ఉండే ఐర‌న్‌ను స‌రిగ్గా గ్రహించ‌దు. అందుకని భోజ‌నం చేశాక గ్రీన్ టీ తాగే అలవాటును మానుకోవాలి. భోజనం చేసిన వెంట‌నే వ్యాయామం చేయ‌రాదు. అలాగే ఎక్కువ సేపు కూడా కూర్చోకుండా చూసుకోవాలి. కొంతసేపు అటు, ఇటు న‌డ‌వాలి. అలాగే తిన్న వెంట‌నే నిద్రించ‌రాదు. గ్యాస్ వ‌స్తుంది. అధికంగా బ‌రువు పెరుగుతారు. తిన్న వెంట‌నే ఈత కొట్టడం చాలా ప్రమాద‌క‌రం. దీని ద్వారా క‌డుపు తిమ్మిరికి వ‌చ్చే ప్రమాదం ఎక్కువ‌. తిన్న త‌రువాత స్విమ్మింగ్ చేస్తే జీర్ణక్రియ బాగా ప‌ని చేస్తుంద‌ని పేర్కొంటారు. స్విమ్మింగ్‌కు జీర్ణక్రియ‌కు సంబంధం లేద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker