Health

పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే కలరా, డయోరియా వచ్చే ప్రమాదం ఉంది.

పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర తృణ ధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. అయితే వేరేవాటితో కలిపి తీసుకోకండి..ఫ్రూట్స్ ఇతర ఆహారం కంటే త్వరగా జీర్ణమవుతుంది.

అయితే ఇతర ఆహారాలతో కలిపి తీసుకున్నప్పుడు.. ఇది శరీరంలో అమా అనే టాక్సిన్స్​ను విడుదల చేస్తుంది. ఇది మీ జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది. అప్పుడు.. ఒక్క పండుతిన్నా.. అది ఎక్కువ బరువున్న ఆహారం జీర్ణం కావడానికి పట్టినంత కాలం పడుతుంది. పోషకాల శోషణ కష్టమవుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణ రసాలలో పులిసిపోవడం ప్రారంభమవుతుంది. ఇది విషపూరితమైన ప్రభావాలను కలిగిస్తుంది. అనారోగ్యం, ఇతర ఆరోగ్య పరిస్థితుల సంభావ్యతను పెంచుతుంది. కాబట్టి ఫ్రూట్స్ ఎప్పుడూ విడిగా తీసుకోవడమే మంచిది. రాత్రుళ్లు తినకండి..నిద్రవేళకు 2-3 గంటల ముందే ఏదైనా ఫ్రూట్ తీసుకుంటే మంచిది.

నిద్రకు ముందే ఏదైనా ఫుడ్ తీసుకుంటే అది జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది. ఇది పండ్లకు కూడా వర్తిస్తుంది. పడుకునే ముందు పండ్లు తింటే నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా చక్కెరను విడుదల చేస్తుంది. ఇది శరీరం విశ్రాంతి తీసుకునేటప్పుడు శక్తి స్థాయిలను పెంచుతుంది. రాత్రి సమయంలో పోషకాలను గ్రహించే, సమీకరించే మన శరీర సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది. అదనంగా రాత్రిపూట పండ్లు తినడం వల్ల ఎసిడిటీ లక్షణాలు పెరుగుతాయి. అందుకే పండ్లను సాయంత్రం స్నాక్‌గా తీసుకోవాలి.

దాని తరువాత తీసుకోకపోవడమే మంచిది. వెంటనే నీరు తాగకండి..పిల్లలు మాత్రమే కాదు.. పెద్దలు కూడా పండ్లు తిన్న వెంటనే నీరు తాగుతూ ఉంటారు. అయితే పండ్లను తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ pH స్థాయి అసమతుల్యతకు కారణమవుతుంది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పుచ్చకాయ, సీతాఫలం, కీర దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లను తీసుకున్నాక నీరు తాగవద్దు అంటున్నారు. ఎందుకంటే వీటిలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు మీరు నీరు తీసుకుంటే.. అది మీ కడుపులోని ఆమ్లతను తగ్గించడం ద్వారా pH బ్యాలెన్స్‌ని మార్చగలదు.

ఇది డయేరియా లేదా కలరా వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నింటిని తొక్కలతో తినండి..విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల విషయానికి వస్తే.. కొన్ని పండ్లకు పై తొక్క ఉత్తమ భాగంగా చెప్పవచ్చు. ఉదాహరణకు.. ఆపిల్ పీల్స్‌లో ఫైబర్, విటమిన్ సి, ఎ ఎక్కువగా ఉంటాయి. దానిని పీల్​తో తినడం వల్ల మీరు ఊబకాయం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఈ విషయం పరిశోధనల్లో కూడా తేలింది. అయితే కొందరు ఆపిల్ పైన తొక్కను తీసేసి తింటారు. అలా కాకుండా ఫ్రూట్స్​ను గోరువెచ్చని నీటిలో 2 నిముషాలు ఉంచి కడిగి తింటే మీ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker