ఈ ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పూర్తిగా తగ్గిపోతుంది.
యూరిక్ యాసిడ్ మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో ఒకటి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం చెందినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అయితే విసర్జన సరిగా జరగకపోయినప్పుడు యూరిక్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది. క్రమంగా ఇది స్ఫటికాలుగా మారి కీళ్లు, వాటి చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, గౌట్ వ్యాధులు వస్తాయి. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే స్థితిని గౌట్ అంటారు.
శరీరంలోని ప్యూరిన్స్ అనే పదార్ధాలు యూరిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తాయి. ఈ పదార్థాలు కొన్ని ఆహారాలలో కనిపిస్తాయి. యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు ప్యూరిన్‌తోపాటు ప్రొటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల కీళ్లనొప్పులు, గౌట్, కిడ్నీలో రాళ్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. యూరిక్ యాసిడ్ తగ్గాలంటే క్రమం తప్పకుండా యూరిక్ యాసిడ్ తగ్గించడానికి మందులు తీసుకోవాలి.
కానీ మందులు తీసుకోవడం ద్వారా మాత్రమే కాకుండా ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంచుకోవచ్చు. అందుకు ముందుగా ఏమి తినాలో, ఏమి తినకూడదో తెలిసి ఉండాలి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించే ఆహారాలలో చెర్రీస్ ముఖ్యమైనవి. ఈ పండు యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇందులో ఆంథోసైనిన్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గిస్తాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. నారింజ వంటి ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
ది యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పండు కాళ్ల వాపును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. యాపిల్స్‌లో మాలిక్ యాసిడ్ ఉంటుంది.ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా చేస్తుంది. ఫలితంగా యాసిడ్ స్థాయి నియంత్రించవచ్చు. ఆపిల్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.