ఈ ఆహార పదార్థాలు మీరు తింటుంటే చాలు. కరోనా కొత్త వేరియంట్ మిమ్మల్ని ఏమి చెయ్యలేదు.
కొత్త వేరియంట్‌తో పెద్దగా భయపడాల్సిన పనిలేదని, రోగులు ఇంటి వద్దే సాధారణ లక్షణాల నుంచి కోలుకుంటారని నిపుణులు చెబుతున్నారు. అయినా ఈ కొత్త వేరియంట్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు బహిరంగా ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని చెబుతున్నారు. అయితే కోవిడ్ 19 సబ్ వేరియంట్ జేఎన్ 1 ప్రస్తుతం భయాందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకీ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జేఎన్1 వేరియంట్ కొత్తేడాది భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.
కేరళలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. బీటా కెరోటిన్, విటమిన్ సి ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
నారింజ, నిమ్మ జాతికి చెందిన పండ్లను తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజులో కనీసం గంటసేపు ఏదైనా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వ్యాయామం చేయకపోయినా వీలైనంత ఎక్కువగా నడవడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద శారీరక శ్రమను పెంచాలని చెబుతున్నారు. వైరస్ దరిచేరకుండా ఉండాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా శరీరం హైడ్రేట్‌గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
శరీరానికి తగినంత నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉంటే శరీరం నుంచి ప్రమాదకరమైన టాక్సిన్స్‌ను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి పెరగడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. సరిపడ నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యకరమైన పెద్దలు రోజులో కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని అంటున్నారు.
నిద్రలేమితో ఇబ్బందిపడే వారి రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మానసిక ఆరోగ్యాన్నికూడా కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు మెడిటేషన్, యోగా వంటి వాటిని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొంటున్నారు.