రోజూ డ్రైఫ్రూట్స్ తినే ముందు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.
రోగ నిరోధక శక్తిని పెంచడానికి డ్రై ఫ్రూట్స్ మనకు సహాయం చేస్తాయి. నిజానికి డ్రై ఫ్రూట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అదే విధంగా విటమిన్స్ మొదలైనవి సమృద్ధిగా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని పెంచుతాయి డ్రై ఫ్రూట్స్. అలానే స్టామినాను ఇవ్వడానికి కూడా ఇవి హెల్ప్ అవుతాయి. అయితే డ్రై ఫ్రూట్స్ అనేవి పోషకాలలో నిండి ఉంటాయి. చలికాలంలో చాలా మంచిది.
డ్రైఫ్రూట్స్‌ను పెరుగు, ఓట్స్, దలియా, స్మూదీల్లో నానబెట్టి ఉదయం పరగడుపు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. డ్రైఫ్రూట్స్ పరగడుపున తీసుకుంటేనే మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల బాడీ ఆరోజంతా ఎనర్జెటిక్‌గా ఉంటారు. ఉదయం పరగడుపున డ్రైఫ్రూట్స్.. ప్రతి రోజూ ఉదయం పరగడుపున బాదం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. మస్తిష్కం వేగవంతమౌతుంది.
ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మానికి చాలా మంచిది. అందుకే ప్రతిరోజూ పరగడుపున బాదాం తినడం అలవాటు చేసుకోండి. పిస్తా.. చాలామందికి రోజూ ఉదయం లేవగానే ఆకలేస్తుంటుంది. దీనికి పిస్తా మంచి పరిష్కారం.
ఉదయం తినడం వల్ల ఆకలి తీరడమే కాకుండా రోజంతా కడుపు నిండకుండా ఉంటుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, ఐరన్ ఉన్నాయి. డయాబెటిస్, కొలెస్ట్రాల్, స్థూలకాయం సమస్యలకు దారితీస్తుంది. కిస్‌మిస్ పండ్లు..చాలామంది ఉదయం లేవగానే రాత్రి నానబెట్టిన కిస్‌మిస్ పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా లాభాదాయకం. పరగడుపున తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.