పెరుగు తినేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ తప్పులు చేయొద్దు. ఎందుకంటే..?
పెరుగులో మన బాడీకి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచి, ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే చాన్స్ చాలా తక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే శరీరానికి చలువ చేస్తుందని పెరుగు తినమని అంటారు. మరి వచ్చేది చలికాలం.. జలుబు, దగ్గు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. ఇటువంటి సమయంలో పెరుగు తింటే జలుబు ఎక్కువ అవుతుందని పెద్దలు చెబుతుంటారు. కానీ చలి కాలంలో కూడా పెరుగు తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయుర్వేద నిపుణులు చెప్పుకొచ్చారు.
కడుపులో ఎసిడిటీ ఏర్పడకుండా pH స్థాయిని బ్యాలెన్స్ చేస్తూ జీర్ణక్రియని మెరుగుపరచడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి. బరువు పెరుగుతామనే భయం కూడా అవసరం లేదు. అయితే పెరుగు తినడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పెరుగు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే ప్రతి రోజు పెరుగు తినకూడదని ఆయుర్వేదం భావిస్తోంది. పెరుగు ఆరోగ్యానికే మంచిదే అయినప్పటికీ మితంగా మాత్రమే తీసుకోవాలి. అందుకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.
రాత్రిపూట వద్దు..రాత్రి వేళ కఫ దోషం అత్యధికంగా ఉంటుంది. పెరుగు తినడం వల్ల కఫ దోషం పెరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కఫ దోషం పెరగడం వల్ల శ్లేష్మం ఏర్పడుతుంది. అందుకే రాత్రి వేళ ఎక్కువగా పెరుగు తినకూడదని చెప్తారు. దానికి బదులుగా మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేడి చెయ్యకూడదు..ఫ్రిజ్ లో పెట్టి తీసిన తర్వాత చల్లగా ఉందని పెరుగు కూడా వేడి చేసేస్తున్నారా? అలా అసలు చెయ్యకూడదు. పెరుగు వేడి చేసి తీసుకుంటే శరీరం వాపుకు దారి తీస్తుంది. అంతే కాదు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది తలెత్తుతుంది. అందుకే పెరుగు ఎప్పుడు వేడి చేయకూడదని ఆయుర్వేదం చెబుతోంది.
రోజూ తినక పోవడమే మంచిది..రోజు పెరుగు తినడం చాలా మందికి అలవాటు. కానీ అలా ప్రతి రోజు తినకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది శరీరంలో మంటని పెంచుతుంది. దాని వల్ల శరీరంలో కఫ, పిత్త దోషాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇది ఏ మాత్రం మంచిది కాదు. అందుకే రోజు పెరుగు తినే అలవాటు ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నించండి. రుతుస్రావం అప్పుడు వద్దు..పీరియడ్స్ లో ఉన్నప్పుడు పెరుగు తినకూడదని ఇంట్లో పెద్దలు చెబుతూనే ఉంటారు. అది నిజమే.. ఎందుకంటే పెరుగు వేడిని పెంచుతుంది. దీని వల్ల పిత్త దోషంపెరుగుతుంది. అధిక రుతుస్రావం, నాసికా రక్తస్రావం జరుగుతున్నప్పుడు భోజనంలో పెరుగుని తీసుకోకపోవడమే ఉత్తమం.