Health

చికెన్ ఎక్కువగా తింటే ఈ జబ్బులు వచ్చే ప్రమాదం ఖచ్చితంగా వస్తాయి.

చికెన్‌పై సాల్మొనెల్లా, క్యాంపీలోబాక్టెర్ SPP వంటి బ్యాక్టీరియా ఉంటాయి. చికెన్‌ను తెచ్చిన వెంటనే రెండు మూడు గంటల్లో వండుకోవాలి. అలా కాకుండా ఫ్రిజ్‌లో పెట్టి… అమెరికన్లలాగా… వారమంతా… కొద్దికొద్దిగా వండుకుంటూ ఉంటే… ఈలోగా ఈ బ్యాక్టీరియా పెరిగి… ఏదో ఒక రోజు… పొట్టలో తేడా కొట్టేస్తుంది. ఆస్పత్రి పాలు కావాల్సి ఉంటుంది. అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరికి ఫుడ్ పాయిజన్ సమస్య కామన్‌గా ఉంటుందని తెలుసా మీకు. అయితే మాంసాహారం తినే వారికి చికెన్ చాలా ఇష్టమైన ఆహారం. చికెన్ నుండి వివిధ రకాల ఆహారాలు తయారు చేస్తారు.

ప్రొటీన్‌తో సహా అనేక పోషక మూలకాలు ఇందులో ఉంటాయి. అందుకే ప్రతిరోజూ చికెన్ తినేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మీరు ఎక్కువ పరిమాణంలో తింటే చికెన్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. చికెన్ ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరగడంతోపాటు బరువు పెరగడంతో పాటు అనేక సమస్యలు వస్తాయి. బరువు పెరుగుతాం.. రోజూ చికెన్ తింటే బరువు పెరగడం ఖాయం. చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, ఫ్రైడ్ చికెన్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వారానికి ఒకసారి తినడం మంచిది. కానీ రోజూ తినడం వల్ల బరువు పెరగడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది.

కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. చికెన్ అప్పుడప్పుడు తినడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు.కానీ మీరు డీప్ ఫ్రైడ్ చికెన్ తింటే మాత్రం అది కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని ఒక నివేదిక ప్రకారం, చికెన్ కూడా బీఫ్ మాదిరిగానే కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి నూనెలో వేయించకుండా, ఉడికించిన, లేదా కాల్చిన చికెన్ తినమని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో వేడి పెంచుతుంది.. చికెన్ చాలా వేడి కలిగించే ఆహారం.

ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి పనిచేస్తుంది. వేసవి కాలంలో చికెన్ తినకపోవడమే మంచిది. ఎందుకంటే అది శరీరంలో అల్సర్లు అదేవిధంగా క్యాన్సర్ ప్రమాదం పెంచేందుకు కూడా ఈ చికెన్ తినడం దోహదపడుతుంది. అందుకే వేసవిలో చికెన్ తినకుండా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కొన్ని రకాల చికెన్ తినడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఒక పరిశోధన ప్రకారం, సైడ్ గా ఉడకని చికెన్ లో ఈ-కోలి బ్యాక్టీరియా కనిపిస్తుంది, ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.

అదేవిధంగా ప్రతిరోజు చికెన్ తింటే శరీరంలో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని తద్వారా శరీర బరువు అమాంతం పెరిగి ప్రమాదకరమైన జబ్బులకు ఆస్కారం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వారానికి ఒకరోజు మాత్రమే. తక్కువ పరిణామాల్లో చికెన్ తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు లభిస్తాయి అని. అదే ఎక్కువ పరిమాణాల్లో తింటే లివర్ పై ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker