ఉదయం నిద్రలేచిన వెంటనే వీటిని తింటే జీవితంలో డాక్టర్ దగ్గరకి వెళ్లారు.
రోగనిరోధక శక్తి అనేది బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు లేదా ఇతర సూక్ష్మజీవుల నుండి ఉత్పన్నమయ్యే వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్లను నిరోధించే శక్తి. మన రోగనిరోధక వ్యవస్థ మన శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. అయితే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఇందుకోసం గాను మన ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఏం తినాలి, ఏం తినకూడదు అనే వాటిపై అవగాహన కలిగి ఉండాలి. కొందరు ఉదయం నిద్ర లేచిన వెంటనే వివిధ రకాల ఆహార పదార్థాలను తింటుంటారు. కొంతమంది ఉదయం లేచిన తర్వాత చాలాసేపటి వరకు ఏమి తినకుండా అంతే ఉండిపోతారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
కాబట్టి ఉదయం లేచిన వెంటనే కొన్ని ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండు ఖర్జూరం.. ఎండు ఖర్జూరాలో పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి ఉదయం తినడం వల్ల శరీరానికి కావాల్సినంత ఐరన్ లభిస్తుంది. ఇక అదే సమయంలో జీర్ణక్రియ కూడా చాలా మెరుగు పడుతుంది.
దీంతోపాటు బరువు తగ్గడానికి సైతం ఉపయోగపడుతుంది. కిస్మిస్.. తీరానికి చాలా అవసరమైంది ఆరోగ్యకరమైనది కిస్మిస్. ఇందులో ఐరన్ ప్రోటీన్ ఫైబర్ వంటివి ఉంటాయి. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల శరీరం బలహీనత దూరం అవుతుంది. రక్తలో హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. పరగడుపున కిస్మిస్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ప్రతిరోజు రాత్రివేళ 6 కిస్మిస్ ల ను నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున నీళ్లతో సహా తీసుకోవాలి. బాదం.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాదం ఎంతగానో ఉపయోగపడుతుంది. బాదంలో పోషక పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. ప్రోటీన్లు ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని రోజు ఉదయం పరగడుపున తీసుకుంటే మతిమరుపు తగ్గి , మెమరీ పవర్ పెరుగుతుంది. బరువు తగ్గించడానికి సైతం ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.