ఇలాంటి వారు పరగడుపున కాఫీ తాగితే ఎంత ప్రమాదమో తెలుసా..?
కాఫీ అనేది ఒక ఉత్తేజపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజలను ఎండబెట్టి, వేగించి, పొడి చేసి, కాఫీ తయారీకి ఉపయోగిస్తారు. కాఫీగింజలను దాదాపు 70 దేశాలలో పండిస్తున్నారు. కాఫీ పంటను ముఖ్యముగా లాటిన్ అమెరికా, దక్షిణా ఈశాన్య ఆసియా, ఆఫ్రికా ప్రాంతాలలో విస్తారంగా పండిస్తున్నారు. వేగించని పచ్చి కాఫీ గింజల వాణిజ్యము ప్రపంచంలో అత్యధికంగా జరిగే ప్రసిద్ధ వాణిజ్యాలలో ఒకటి. కాఫీ గింజలలో ఉన్న కాఫి అనే పదార్ధము మానవులను ఉత్తేజపరుస్తుందని ఊహించబడుతుంది. కాఫీ ప్రపంచంలో అత్యధికంగా సేవించే ఉత్తేజపానీయము. కాఫీ అనేది ఒక ప్రసిద్ధ పానీయం.
అయితే అన్ని రకాల కాఫీలు ఒకేలా ఉండవు. కాఫీ రకాన్ని బట్టి దాని ప్రభావాలు ఉంటాయి. ఇన్ స్టంట్, డికెఫిన్, హాఫ్ కెఫీన్ మొదలైనవి పరిగణలోకి తీసుకుంటారు. అలాగే కాఫీ ఎలా తీసుకుంటున్నారు పాలు, క్రీమ్, చక్కెరతో దేన్ని ఉపయోగిస్తున్నారు అనేది కూడా అది ఎలా జీర్ణమవుతుందనేది గమనించాలి. ఈ సమస్యలున్న వాళ్ళు కాఫీ తాగొద్దు.. చాలా మంది పరగడుపున కాఫీ తాగేస్తారు. ఇది కొంతమందికి హాని కలిగించకపోవచ్చు. కానీ మరికొంతమందిలో మాత్రం కడుపులో ఆమ్లం ఉత్పత్తి అయి గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD), గుండెల్లో మంట వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు.
GERD సమస్యతో బాధపడే వాళ్ళు కాఫీ వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే అనే దాని మీద పరిశోధనలు అసంపూర్తిగా ఉన్నాయి. అయితే 2020లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం కాఫీ, టీ, సోడా వంటివి తీసుకోవడం వల్ల GERD లక్షణాలు మరింత పెరుగుతున్నాయని గుర్తించారు. పొద్దున్నే కాఫీ తాగిన తర్వాత గుండెల్లో మంట/ GERD లక్షణాలు గమనించినట్లయితే వాటిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇటువంటి ఇబ్బందులు ఉంటే కాఫీకి దూరంగా ఉండటమే మంచిది. శరీరంలోకి కెఫీన్ వెళ్ళిన 30 నిమిషాల తర్వాత దాని ప్రభావం చూపుతుంది. ప్లాంటా మెడికా సమీక్ష ప్రకారం కెఫీన్ దాదాపు 45 నిమిషాలలో కడుపు, చిన్న పేగు ద్వారా గ్రహించబడుతుంది. కాఫీ తాగిన వెంటనే పరిస్థితి ఎలా ఉంటుందనేది గమనించుకోవాలి. కొంతమందికి వెంటనే కడుపులో ఇబ్బందిగా అనిపించి బాత్ రూమ్ కి వెళతారు.
మరికొంతమందిలో మాత్రం కాఫీ తాగిన తర్వాత ఉత్సాహంగా అనిపిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఎటువంటి హాని జరగకపోవచ్చు. ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం కాఫీ కంటే ముందుగా ఏదైనా చిరుతిండి తీసుకుని ఆ తర్వాత కాఫీ ఎంచుకుంటే సమస్యలేమీ రావని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకి 4 కప్పులకి మించి కాఫీ అసలు తీసుకోవద్దు.