ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?
ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. నీరు మన శరీరానికి చాలా ముఖ్యమైనది. శరీరంలో దీని లోపం వల్ల అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం నీళ్లు తాగాలని వైద్యుల సూచిస్తున్నారు. అయితే నిజానికి రాత్రి 7 నుంచి 8 గంటలు పడుకోవడం వల్ల మన శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. మన శరీరం తిరిగి సరిగ్గా పనిచేయాలంటే ద్రవాలను తీసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం లేవగానే ఒక గ్లాసు నీటిని తాగడం వల్ల మీరు మరింత ఎనర్జిటిక్ గా మారిపోతారు. నీరు మన శరీరానికి చాలా చాలా అవసరం.
గ్లాస్ వాటర్ తో రోజును ప్రారంభించడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.. ఖాళీ కడుపుతో నీటిని తాగడం వల్ల జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. జీవక్రియను పెంచుతుంది.. ఉదయాన్నే గ్లాస్ నీటిని తాగడం వల్ల మీ జీవక్రియ పెరుగుతుంది. రోజంతా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే మర్చిపోకుండా ఉదయం లేవగానే గ్లాస్ నీటిని తాగండి.
ఎసిడిటీని తగ్గిస్తుంది.. పరిగడుపున నీటిని తాగడం వల్ల కడుపులో ఎసిడిటీ తగ్గుతుంది. ఈ ఎసిడిటీ ఎన్నో జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంటతో బాధపడేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉదయాన్నే నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు పోతాయి. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మీ చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా, అందంగా చేస్తుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది.. నిర్జలీకరణం అలసట, బద్ధకానికి దారితీస్తుంది. ఉదయం నీటిని తాగడం వల్ల మీ శరీరం రీహైడ్రేట్ అయ్యి మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి.
రోజంతా మరింత అప్రమత్తంగా, ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడుతుంది. తలనొప్పిని తగ్గిస్తుంది.. తలనొప్పి డీహైడ్రేషన్ వల్ల కూడా వస్తుంది. ఉదయం నీటిని తాగడడం వల్ల మీ శరీరం రీహైడ్రేట్ అవుతుంది. అలాగే మీకు రోజంతా తలనొప్పి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.. ఉదయాన్నే నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లి మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ళు, ఇతర మూత్రపిండాల సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఉదయాన్నే నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ ను బయటకు పోతాయి.
ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి నీరు చాలా చాలా అవసరం. ఉదయం లేచిన వెంటనే నీటిని తాగటం వల్ల రోజంతా మీ శరీరం ఆరోగ్యకరమైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉదయం గ్లాస్ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. జీవక్రియ పెరుగుతుంది. ఎసిడిటీ తగ్గడంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది మీ మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.