చెవిలో ఇయర్ బడ్స్‌తో తిప్పినప్పుడు సమ్మగా ఉందా..? మీకు సమస్యే ఉంది, జాగర్త.
కొందరు పేపర్‌ను చుట్టలా చుట్టి, ఇంకొందరు బట్టను పెట్టి దాన్ని తీస్తుంటారు. అయితే, జాగ్రత్త. ముఖ్యంగా కాటన్ బడ్స్‌తో మరీ జాగ్రత్త. ఎందుకంటే వాటివల్ల వినికిడి లోపం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యులే కాదు.. కాటన్ బడ్స్ తయారు చేసే కంపెనీలు కూడా వాటిపై ‘కాటన్ బడ్స్ ప్రమాదకరం’ అని రాస్తారు. అయితే కరణ్ రాజన్ అనే డాక్టర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చెవిలోపల ఏదైనా వస్తువు తాకినపుడు వాగసనాడిని ప్రేరేపించవచ్చు. అదే హాయిగొలిపించే ‘హ్యాపీ బటన్’. కానీ, అది హ్యాపీ బటన్ కాదు.. ఒక లోపం. ఇయర్ గాస్మ్ కలిగిన వారు కాటన్ బడ్స్ ను ఉపయోగించకూడదు. చెవిలో కాటన్ బడ్ పెట్టకూడదని మీరు చెబుతున్నారు. కానీ ప్రకృతి అక్కడ ఒక హ్యాప్పి బటన్ ఎందుకు పెట్టినట్టూ అని ఒక ఫాలోవర్స్ అడిగాడు. దానికి ఆయన స్పందిస్తూ.. ‘‘చెవుల్లో మీరు ఫీలవుతున్న హ్యాప్పీ బటన్ నిజానికి ఒక లోపం అని గుర్తించండి’’ అని చెప్పారు.
చెవిలో కాటన్ బడ్ పెట్టినపుడు దగ్గువచ్చే వారిలో గొంతులో ఏదో ఉందన్న సమాచారం మెదడుకు చేరడం వల్ల దగ్గు వచ్చేస్తుంది. అలాగే గొంతులో ఏదైనా అడ్డు పడినపుడు చెవిలో మంట కూడా రావచ్చట. కొంత మందిలో మాత్రం ఇయర్ గాస్మ్ వస్తుంది. ఇలా ఇయర్ గాస్మ్ వచ్చే వారిలో వాగస నాడిని ప్రేరేపించడం వల్ల అనుభవించే ఇతర ఉద్వేగాల మాదిరిగానే పారాసింథటిక్ రియాక్షన్ తో ప్రశాంతమైన భావన కలుగుతుందట. అందుకే చెవులు చాలా మందిలో ఎరోజెనస్ జోన్లుగా ఉంటాయట. చెవుల్లో అంగస్తంభనకు సంబంధించిన కణజాలం కూడా ఉంటుంది.
అందుకే అక్కడ స్టిమ్యూలేట్ చేసినపుడు అంగస్తంభనలు కలగవచ్చని కూడా రాజన్ వివరించారు. చెవిలో ఆహ్లదకర భావన కలిగించేవి కాటన్ బడ్స్ మాత్రమే కాదు, స్పర్ష ఏదైనా కూడా ప్రేరేపణ కలిగించవచ్చు. ఒక్కోసారి మ్యూజిక్, చిన్నగా పాడడం కూడా ఇలాంటి హాయినే కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అది భావప్రాక్తికి కారణం కావచ్చని కూడా తెలిపారు. ఇయర్ గాస్మ్ ను ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటే మాత్రం తక్కువ హానికలిగించే పద్ధతులను అనుసరించడం మంచిదని నిపుణుల సలహా.
ఊరికే చెవిలో పుల్ల తిప్పడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి చెవిలోని వాక్స్ ను బయటకు తియ్యడానికి బదులు మరింత లోపలికి తొసెయ్యవచ్చు, కర్ణభేరికి నష్టం కలిగించవచ్చు. ఫలితంగా అకస్మాత్తుగా వినికిడి లోపం రావచ్చు లేదా చెవిలో నొప్పి రావచ్చు. లేదా చెవి నుంచి స్రావాలు రావచ్చు లేదా ఇన్ఫెక్షన్ కూడా సోకవచ్చు. నిజానికి చెవులు ప్రత్యేకంగా శుభ్రం చెయ్యాల్సిన అవసరం లేదట. అవి సహజంగానే శుభ్రం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని నిపుణులు వివరణ ఇస్తున్నారు.