ఈ సమయంలో దుబాయ్ పయనమైన Jr. ఎన్టీఆర్. ఎందుకో తెలుసా..?
కొడుకు అభిరామ్ తో పాటు దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ దర్శనమిచ్చాడు. అలాగే ఆయన ఎక్కిన ఫ్లైట్ లోనే యాంకర్ హిమజ ఉన్నారట. ఎన్టీఆర్ తో ఆమె ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టారు. దేవర షూటింగ్ కి షార్ట్ బ్రేక్ ఇచ్చి ఎన్టీఆర్ దుబాయ్ వెల్లడమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర విడుదల కానుంది.
అయితే కొరటాల శివ డైరెక్షన్‌లో ‘దేవర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్యామిలీతో కనిపించిన వీడియో వైరల్‌గా మారింది. తన కొడుకులిద్దరితో పాటు సూట్ కేస్ పట్టుకుని ఎన్టీఆర్ కనిపించారు. ఫ్యామిలీతో కలిసి ఆయన దుబాయ్‌లో జరిగే సైమా అవార్డుల వేడుకలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
RRR లో నటనకు గాను ఎన్టీఆర్‌ను ఉత్తమ నటుడిగా సైమా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దుబాయ్ పర్యటనలో ఎన్టీఆర్ ఈ అవార్డు అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్టుపై సర్వత్రా వాడి వేడీ చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఎన్టీఆర్ ఇప్పటివరకూ నోరు మెదపలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు.
ఈ అంశం టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ మాత్రం తగ్గకుండా వారికి కౌంటర్ ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఏప్రిల్ 5, 2024 థియేటర్లలో విడుదల కాబోతోంది. రీసెంట్ షెడ్యూల్‌లో నీటి అడుగున అద్భుతమైన సీన్ షూట్ చేసినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ ‘వార్ 2’ కూడా ఎన్టీఆర్ లిస్ట్‌లో ఉంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.