Health

రోజుకు ఒకటి ఈ లడ్డూ తింటే చాలు జీవితంలో హాస్పిటల్ కి వెళ్ళాల్సిన పని రాదు.

డ్రై ఫ్రూట్స్ లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నీ ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం, నిస్స‌త్తువ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. కంటిచూపు మెరుగుప‌డుతుంది. గుండె చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. చ‌ర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే డ్రైఫ్రూట్స్ ఆరోగ్యకరమైన ఆహారాల జాబితాలోకి వస్తాయి. శరీరానికి శక్తిని అందించడంతో పాటూ ఎన్నో పోషకాలను అందిస్తాయి డ్రై ఫ్రూట్స్. పిల్లలకు రోజూ ఒక డ్రై ఫ్రూట్ లడ్డూ తినడం వల్ల వారికి ఎంతో మేలు జరుగుతుంది.

ముఖ్యంగా ఈ లడ్డూలో ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి శరీరానికి అత్యవసరమైన పోషకాలన్నీ అందుతాయి. కావాల్సిన పదార్థాలు..ఖర్జూరాలు -పావు కిలో, పిస్తాలు – 50 గ్రాములు, బాదం పప్పులు – 50 గ్రాములు, ఎండు ద్రాక్ష – 50 గ్రాములు, ఓట్స్ – 50 గ్రాములు, జాజికాయ పొడి – పావు స్పూను, నెయ్యి – నాలుగు స్పూన్లు, గోధుమ పిండి – యాభై గ్రాములు, శెనగ పిండి – యాభై గ్రాముు, ఎండు కొబ్బరి పొడి – యాభై గ్రాములు, లవంగాల పొడి – పావు స్పూను. తయారీ ఇలా.. గోధుమ పిండి, శెనగ పిండి విడి విడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఖర్జూరాలు తప్ప మిగతావన్నీ కూడా వేయించాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో వేయించిన గోధుమ పిండి, శెనగ పిండి వేయాలి. అందులో ఖర్జూరాలు, పిస్తాలు, బాదం పప్పులు, ఎండు ద్రాక్షలు,ఓట్స్, ఎండు కొబ్బరి పొడి వేయాలి. లవంగా పొడి, జాజికాయ పొడి కూడా వేయాలి. ఇప్పుడు నెయ్యిని కూడా వేయాలి. అన్నీ కలిపి లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇవి ఎక్కువ రోజుల పాటూ నిల్వ ఉంటాయి. నెల రోజులైనా చెక్కు చెదరకుండా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌ లడ్డూ తినడం వల్ల వాటిల్లో ఉండే మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి6 వంతి అత్యవసరమైన పోషకాలు అందుతాయి.

ఈ లడ్డూ తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. ఇవి శరీరానని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. బరువు తగ్గించే లక్షణాలు కూడా ఈ లడ్డూకు ఎక్కువ. ఒక్క లడ్డూ తిన్నాక పొట్ట నిండిన ఫీలింగ్ ఎక్కువ కాలం పాటూ ఉంటుంది. దీని వల్ల ఇతర ఆహారాలేవీ తినరు. భోజనం చేయాలన్న కోరికను కూడా తగ్గిస్తుంది. కాబట్టి మీకు తెలియకుండానే బరువు తగ్గుతారు.

పొట్ట ఆరోగ్యానికి ఈ లడ్డూ ఎంతో అవసరం. గుండె ఆరోగ్యానికి అవసరమైన ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె పోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు కూడా లడ్డూను తినడం వల్ల మంచి జరుగుతుంది. దీనిలో పంచదార, బెల్లం వంటివి వాడలేదు . ఖర్జూరాల్లో ఉండే తీపి మాత్రమే ఉంటుంది. కాబట్టి వారు కేవలం ఒక లడ్డూ రోజుకు తింటే చాలు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker