ఇలాంటి సందర్భాల్లో నీళ్లు తాగితే చాలా ప్రమాదం, హఠాత్తుగా వచ్చే మార్పులు ఇవే.
నీరు త్రాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరంలో వ్యర్ధాలను తొలగించడం, అవయవాల పనితీరును క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. మన శరీరంలో 70% వరకు నీరు ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ శరీరంలో నీటి శాతం ఎక్కువైతే అది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొంతమంది రోజుకు 8 నుండి 9 గ్లాసుల కంటే ఎక్కువ నీటిని త్రాగుతారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం నీటిని దూరం పెట్టాలి. లేకుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఏ ఏ సందర్భాల్లో నీటిని దూరం పెట్టాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చాలామంది నిద్రపోయే ముందు నీళ్లు తాగేసి పడుకుంటారు. ఇలా చేయడం వల్ల రాత్రంతా దాహం వేయదని అనుకుంటారు. కానీ నిద్రించే ముందు ఎక్కువ నీరు తాగడం మంచిది కాదు. దాహంగా అనిపిస్తే కొంచెం మీరు మాత్రమే తాగాలి. లేకుంటే రాత్రి సమయంలో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది. దీనివల్ల నిద్రాభంగం కలుగుతుంది. అంతేకాదు రాత్రి నిద్రపోయాక మూత్రపిండాల పనితీరు చాలా మందగిస్తుంది.
ఈ సమయంలో నీరు ఎక్కువగా ఉంటే మూత్రపిండాలు రాత్రిపూట సరిగా పనిచేయలేక ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజూ వ్యాయామం చేసే వారి సంఖ్య అధికంగానే ఉంది. వ్యాయామం చేసేటప్పుడు మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువవుతుంది. ఈ సమయంలో చాలామంది నీరు అధికంగా తాగుతారు. వ్యాయామం చేసేటప్పుడు నీరు తాగితే శరీర ఉష్ణోగ్రతలో హఠాత్తుగా మార్పులు వచ్చేస్తాయి. ఇవి ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. కనుక వ్యాయామం చేశాక 20 నిమిషాల పాటు నీళ్లు తాగకపోవడమే మంచిది.
శరీర ఉష్ణోగ్రత సహజంగానే తగ్గుతూ ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గాక నీళ్లు తాగితే ఉత్తమం. ఆహారం తీసుకునే సమయంలో కూడా చాలామంది ఎక్కువ నీళ్లు తాగేస్తూ ఉంటారు. ఇలా నీళ్లు తాగడం వల్ల శరీరానికి సరిపడా ఆహారం తీసుకోలేరు. ఆహారం తినడానికి అరగంట ముందు, ఆహారం తిన్న అరగంట తర్వాత… నీళ్లు తాగకపోవడమే మంచిది. ఆహారం తింటున్నప్పుడు నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుంది.
పేగుల పనితీరు మందగిస్తుంది. కాబట్టి ఆహారం తింటున్న మధ్యలో, ఆహారానికి తినడానికి అరగంట ముందు, తిన్న అరగంట తర్వాత ఎలాంటి నీటిని తాగకపోవడమే ఉత్తమం. శరీరానికి ఎంత అవసరమో అంత నీటిని మాత్రమే తాగాలి. అతిగా తాగితే శరీరంలో నీటి నిల్వలు పెరిగిపోతాయి. మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది. జీర్ణ సంబంధ వ్యాధులు రావచ్చు. పొట్ట ఉబ్బరం వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది.