గుడ్ న్యూస్, ఈ వ్యాధి వచ్చిన వారు మద్యం తాగితే తగ్గుతుందట..!
రోజూ మద్యానికి బానిసలైన వారు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ, అతిగా మద్యం సేవించడం క్యాన్సర్, కాలేయ వైఫల్యంతో సహా అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, రోజుకు ఎంత మద్యం తాగడం సురక్షితం. అయితే మద్యం ఆరోగ్యానికి హానికరం.. ఈ విషయాన్ని డాక్టర్లే కాదు మద్యం బాటిల్ పైన కూడా కంపెనీలు ముద్రిస్తుంటాయి. ఆయన ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోరు. మందుబాబులు తమకు నచ్చిన బ్రాండ్లను నచ్చినంతగా తాగేస్తున్నారు.
గడచిన పదేళ్లలో మద్యం తాగి వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొందరు హాలిడేస్ వీకెండ్స్ లో మద్యం సేవిస్తుంటే.. మరికొందరు నిత్యం తాగుతున్నారు. మద్యం తాగడం వలన దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. క్యాన్సర్, లివర్ వ్యాధులు, కామెర్లు, ఉదరానికి సంబంధించిన అనేక వ్యాధులు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. డాక్టర్ల సూచనలను ఎవరూ లెక్క చేయడం లేదు. మద్యం మానేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు.
కొత్తగా అలవాటు చేసుకునే వారు పెరుగుతూనే ఉన్నారు. మద్యం తాగడం వలన అనేక వ్యాధులు వస్తాయని నిర్ధారణ అయింది. వైద్యులు చాలామందికి మద్యం మానేయాలని సూచనలు చేస్తున్నారు. కానీ ఈ వ్యాధి మాత్రం మద్యం తాగడం వలన తగ్గుతుందట. బ్రాండీ, రమ్ తాగడం వలన జలుబు దగ్గు తగ్గుతుందట. జలుబు, ఫ్లూ తగ్గడానికి బ్రాందీ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
బ్రాందీ లో ఉండే బలమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయట. శ్లేష్మం తొలగించడంలో బ్రాందీ సహాయపడుతుందని పేర్కొంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు జలుబు, దగ్గు తగ్గేలా చేస్తాయని చెబుతున్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మాత్రం తెలియదు.