Health

మధుమేహం ఉన్నవారు ఎక్కువగా మద్యం తాగితే ఏం జరుగుతుందో తెలుసుకోండి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెర పదార్థాలను తినకూడదు. కానీ పండ్లు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే మధుమేహం ఉన్నవారు కొన్ని పండ్లను తినకూడదు. ఏ పండ్లు తినకూడదో తెలుసుకుందాం. కొన్ని పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. ఇది మధుమేహం ముప్పును మరింత పెంచుతుంది. అయితే అన్నమే హాని చేస్తున్నప్పుడు మద్యం వారి శరీరానికి చేసే హాని మరింత ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి.

మధుమేహానికి మద్యం తోడైతే అగ్నికి పెట్రోల్ తోడైనట్టే. శరీరంలో ఆ రెండూ కలిసి పెట్టే మంటను ఆపడం వైద్యులకు కూడా కష్టంగానే మారుతుంది. నిజానికి మధుమేహం వల్ల సాధారణంగానే నాడులు త్వరగా దెబ్బతింటాయి. ఇక మద్యం తాగితే నాడులు దెబ్బ తినే వేగం మరింతగా పెరుగుతుంది. చేతులు, కాళ్లు, శరీరం మంట పెడుతూ ఉంటాయి. సూదులతో పొడిచినట్టు అవుతుంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లు పడతాయి. మద్యం తాగే వారిలో ఈ సమస్యలు రెట్టింపుగా ఉంటాయి.

అందుకే మధుమేహం ఉన్నవారు మద్యాన్ని పూర్తిగా మానేయాలి. మధుమేహలకు మద్యం అలవాటు ఉంటే కాళ్లు, పాదాలు పుండ్లు పడడం త్వరగా జరుగుతుంది. దీనివల్ల వాటిని తొలగించాల్సి కూడా రావచ్చు. చాలామంది మధుమేహలు మద్యం తాగాక భోజనం కూడా చేయకుండా నిద్రపోతారు. ఇది శరీరాన్ని మరింత త్వరగా క్రుశించి పోయేలా చేస్తుంది. మద్యం తాగాక భోజనం చేయకపోవడం, మందులు వేసుకోకపోవడం అనేవి శరీరంలోని కాలేయాన్ని దెబ్బతీస్తుంది.

కాలేయం మన శరీరంలో గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. రక్తంలో ఈ గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండాలి, అతిగా పెరగడంగానీ, తగ్గడం కానీ మంచిది కాదు. అతిగా పెరిగితే మధుమేహం ఉన్నట్టు లెక్క. అయితే ఈ ప్రక్రియను మద్యం దెబ్బతీస్తుంది. దీనివల్ల గ్లూకోజ్ సరిగా ఉత్పత్తి కాదు, ఉత్పత్తి అయినా కూడా దాన్ని శరీరం వినియోగించుకోలేదు. ఒక్కోసారి గ్లూకోజ్ మోతాదులు తీవ్రంగా పడిపోయే అవకాశం కూడా ఉంది. తాగినా కూడా కచ్చితంగా భోజనం చేసి మందులు వేసుకోవాలి. ఇలా అయితే ప్రమాదం కాస్త తగ్గవచ్చు.

కానీ మద్యం తాగాక ఆహారాన్ని, మందులను దూరం పెడితే మాత్రం తక్కువ రోజుల్లోనే ఆ ప్రభావం మీకు కనిపిస్తుంది. ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మందులు వేసుకుంటున్నప్పుడు మధ్యాహ్న దూరం పెట్టడం చాలా ముఖ్యం. మందులు, మద్యం రెండూ కలిస్తే శరీరంలో మంటలు రావడం, వాంతులు కావడం వంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు రక్తపు వాంతులు కూడా కావచ్చు. కాబట్టి మధుమేహలు పూర్తిగా మద్యాన్ని దూరం పెట్టడమే మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker