రోజు ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఈ రోగాలు మీకు జీవితంలో రావు.
మజ్జిగలో ప్రొబయోటిక్ బాక్టీరియా ఉంటుంది. అందువల్ల ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగితే జీర్ణ సమస్యలు మాయమవుతాయి. ముఖ్యంగా కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అల్సర్ సమస్యలు ఉన్నవారు ఇలా తాగితే వీటి నుంచి బయటపడొచ్చట. అలాగే, ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. అయితే మజ్జిగతో మనకు ఎన్నో లాభాలుంటాయి. పెరుగు కంటే ఎక్కువ ప్రయోజనాలు మజ్జిగలో దాగి ఉన్నాయి. రోజులో ఎక్కువ సార్లు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మజ్జిగ గుండె సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది.
రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అధిక కొవ్వును నియంత్రిస్తుంది. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఎముకలను బలంగా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంద. శరీరానికి అవసరమయ్యే సోడియం, కాల్షియం అందిస్తుంది. మజ్జిగతో మనకు ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలో మెటబాలిజంను పెంచుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగేందుకు దోహదం చేస్తుంది. మజ్జిగలో ఒక టీ స్పూన్ తేనెను కలుపుకుని ఉదయాన్నే పరగడుపున తాగితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. క్రమం తప్పకుండా రెండు నెలల పాటు ఇలా చేస్తే ఊబకాయం సమస్య దూరం అవుతుంది.
అజీర్తి, ఎసిడిటి సమస్యలకు చెక్ పెడుతుంది. అధిక బరువు తగ్గేందుకు మజ్జిగ ఉపయోగపడుతుంది. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్ ఎ మరియు డి శరీరానికి అధిక మోతాదులో అందుతాయి. మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు కలిపి పిల్లలు పెద్దలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనం. పావు కప్పు పెరుగును ఒక పాత్రలోకి తీసుకుని ఒక గ్లాసు నీళ్లు కలపాలి. ఉప్పు, జీలకర్ర పొడిని వేయాలి.
బ్లెండర్తో ఆ మిశ్రమాన్ని పూర్తిగా కలుపుతూ పలచగా చేసుకోవాలి. దీన్ని భోజనంతో పాటు లేదా భోజనం తరువాత తీసుకోవడం వలన మంచి ఫలితం వస్తుంది. వేసవి కాలంలో శరీరం డీ హైడ్రేడ్ కాకుండా ఉండాలంటే సరైన సమయంలో నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటికి బదులు పల్చని మజ్జిగ తాగడం వల్ల చల్లదనం తో పాటు ఇతర సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు. మజ్జిగ వల్ల మనకు ఎన్నో లాభాలున్నాయి. పెరుగుకంటే మజ్జిగలోనే అధిక ప్రొటీన్లు ఉండటంతో మజ్జిగ రోజు తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.
మజ్జిగ వల్ల మనకు ఒనగూరే ప్రయోజనాలు అనేకం. పాల నుంచే పెరుగు, మజ్జిగ వస్తాయి. కానీ పెరుగుకంటే మజ్జిగనే మనకు ఆరోగ్యం బాగు చేయడంలో దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో మజ్జిగ తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందరు ఈ విషయాన్ని తెలుసుకుని మజ్జిగను తీసుకుని ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.