Health

బీర్‌ తాగే అలవాటు ఉందా..! ఈ రోగాలు మిమ్మల్ని ఏమి చేయలేవు.

బీర్ గురించి పరిశోధనలన్నీ బీర్ మితంగా తీసుకుంటే అది అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచిస్తున్నారు. ఒత్తిడి, భయము, అలసట వంటి వాటి నుంచి బయటపడొచ్చంటున్నారు పరిశీధకులు. కానీ దీనిని 350 మి.గ్రా కంటే ఎక్కువ తీసుకోకూడదని కూడా సూచిస్తున్నారు. అయితే హాలీడే సీజన్ కావొచ్చు లేదా ఏదైనా ఫంక్షన్ కావొచ్చు.. బీరు ప్రియులకు ఇక పండగే. బీరు మీద బీరు తాగుతూ చిందేస్తుంటారు. తెగ ఎంజాయ్ చేస్తుంటారు. సాధారణంగా ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమని అంటారు.

కొన్నిసార్లు అదే కొన్నిరకాల వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తాయని అంటున్నారు రీసెర్చర్లు. ఆమ్స్టర్డామ్ యూనివర్శిటీకి చెందిన నిపుణులు ప్రొఫెసర్ ఎరిక్ క్లాస్సెన్ ఈ అధ్యయనానికి సంబంధించి వివరణ ఇచ్చారు. రెట్టింపు కిణ్వ ప్రక్రియతో వచ్చే పొంగు నుంచి స్ట్రాంగ్ బీర్ తయారువుతుందని, ఇదెంతో ఆరోగ్యకరమైనదిగా ఆయన తెలిపారు. అలా అని ఒకటి కంటే ఎక్కువ మొత్తంలో బీరు తాగితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా లేకపోలేదన్నారు.

ప్రోబయోటిక్స్ ఆహరం ఎందుకు ఆరోగ్యానికి మంచిదంటే.. ప్రోబయోటిక్స్, ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. కడుపులోని జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది. కేవలం పెరుగు మాత్రమే సహజ ప్రోబయోటిక్ ఆహారం అంటారు. అనారోగ్యకరమైన ఆహారాలు తింటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా నశిస్తాయి.

తద్వారా జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. బోయెల్ (పేగు) క్యాన్సర్ , అల్జీమర్ (మతిమరుపు) వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని ప్రోబయోటిక్స్ సాయంతో శరీరంలోని కొవ్వును కరిగిస్తాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంటే.. మీ శరీరంలోని కేలరీలను తగ్గిస్తాయని అర్థం. జీర్ణ ప్రక్రియ సమయంలో తీసుకున్న ఆహారం నుంచి కేలరీలను ఖర్చు అయ్యేలా చేస్తాయి.

ఎక్కువ మొత్తంలో ఆల్కాహాల్ సేవించినా కూడా మొత్తానికే ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు ఒక (ప్రోబయోటిక్ రిచ్) బీర్ ను తాగడం ద్వారా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రొఫెసర్ క్లాస్సెన్ స్పష్టం చేశారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే బీరు తాగండి.. లావు తగ్గండి.. క్రమంగా స్థూలకాయం నుంచి బయట పడండి. తస్మాత్ మీ ఆరోగ్యం జాగ్రత్త.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker