కలలో ఇవి కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులవుతారు.
ఒక్కోసారి కలలు మన భవిష్యత్తును సూచిస్తాయి. జరగబోయే అంశాలకు సంబంధించి అవి కొన్ని సంకేతాలను ఇస్తాయి. అవి మంచివి కావచ్చు లేదా చెడు సంకేతాలు కావచ్చు. చాలాసార్లు నిద్రలేవగానే మనం అప్పటివరకూ వచ్చిన కలను మర్చిపోతాం. కొన్నిసార్లు మాత్రం కల బాగా గుర్తుంటుంది. కలలోని సంఘటనలను మనం గుర్తు తెచ్చుకోగలం. కలలో కనిపించే వ్యక్తులు, వస్తువుల్ని గుర్తించగలం. అయితే కల అంటే స్వప్నం. ఇది రంగులమయంగా ఉంటుంది. కలవరపెట్టేలా కూడా ఉంటుంది. మనకు కలలు రావడం సహజమే. వెన్నంటుకుంటూనే కన్నంటుకుంటే కలలు వస్తుంటాయి. కలలో మనం ఎక్కడికి వెళతామో తెలియదు.
ఏదో ప్రమాదంలో చిక్కుకున్నట్లు భయం కలుగుతుంది. ఇలా ఎన్నో రకాల కలలు మనల్ని కవలవరపెడుతుంటాయి. మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక రకంగా అనారోగ్యం దరిచేరినప్పుడు మరోలా కలలు వేధిస్తుంటాయి. మనస్తత్వ నిపుణుల ప్రకారం కలలు మన భవిష్యత్ ను నిర్దేశిస్తాయని చెబుతున్నారు. కలలో మంచి అయినా చెడు అయినా మనకు సంకేతాలు మాత్రం ఇస్తుంటాయి. మనకు వచ్చే కలలు మనకు గుర్తుండవు. కలలో మనం ఏం చేస్తామో కూడా తెలియదు.
మెలకువ వచ్చాక చూసుకుంటే అంతా మరిచిపోతాం. అప్పటివరకు వచ్చిన కల మనకు గుర్తుకు రాదు. కానీ కలలో మనకు నిజజీవితంలో జరిగనివి ఎన్నో జరుగుతాయి. కొందరేమో మంచి కలలు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుంటారు. కానీ ఏవో గందరగోళంగా వచ్చినప్పుడు మాత్రం భయపడుతుంటారు. కలలో జరిగిన సంఘటనలు చాలా వరకు మనకు గుర్తుకు వచ్చే అవకాశాలు తక్కువ. కలలో కనిపించే వ్యక్తులు, వస్తువుల్ని కొన్ని సార్లు గుర్తిస్తుంటాం. భయంకరమైన కలలు వచ్చినప్పుడు మాత్రం వాటిని మరిచిపోయేందుకే ప్రయత్నిస్తాం.
కలలో శుభ సంకేతాలు ఇచ్చే కలలు మనకు భవిష్యత్ లో ధనవంతులం అవుతామని సూచిస్తాయి. పీడ కలలు వస్తే మనకు చెడు జరుగుతుందని తెలియజేస్తాయి. ఇలా కలలు మనకు ఎన్నో విషయాలు సూచనప్రాయంగా చెబుతుంటాయి. కలలో మనకు తామరపువ్వు కనిపిస్తే మనం ధనవంతులం అవుతామని సంకేతం. భవిష్యత్ లో లక్ష్మీదేవి ఆశీర్వాదం మనపై ఉండబోతోందని అర్థం. త్వరలో మనం బాగా డబ్బు సంపాదిస్తామని కూడా దీనికి నిదర్శనం.
కలలో తేనెపట్టు కనిపించినా తేనెటీగలు తారసపడినా అది శుభాలు కలిగిస్తాయని నమ్ముతుంటారు. మాధుర్యం కలిగిన తేనెను అందించే తేనెటీగలు కనపించడం వల్ల మనకు జీవితంలో చాలా ఆనందాలు రాబోతున్నాయని తెలుస్తోంది. అయితే తామరపువ్వు, తేనెటీగలు అందరికి కనిపించవు. అది అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తాయి. ఇలా కలలో మనకు కనిపించే వాటితో కూడా మన అదృష్టం మారుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తుంటారు.