Health

మధుమేహం ఉన్నవారు తరచూ ఈ డ్రాగ‌న్ ఫ్రూట్స్ తింటుంటే చాలు, పూర్తిగా తగ్గిపోతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, రిచ్ ఫైబర్ డ్రాగన్ ఫ్రూట్‌లో ఉన్నాయి. ఈ పండు మధుమేహం, గుండె, క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో లైకోపీన్, బీటా కెరోటిన్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కరోనా కాలంలో డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అయితే డ్రాగ‌న్ ఫ్రూట్ పండ్ల‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. పోష‌కాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విట‌మిన్లు సి, ఇ, బి6ల‌తోపాటు ఐర‌న్‌, మెగ్నిషియం, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి.

అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగానే ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పోష‌కాహార లోపం రాకుండా చూస్తాయి. వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ‌ను అందిస్తాయి. ఈ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. దీంతో తెల్ల ర‌క్త‌క‌ణాల ఉత్ప‌త్తి మెరుగు ప‌డుతుంది. దీని వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. ఈ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ‌శ‌క్తిని మెరుగు ప‌రుస్తుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే గ్యాస్ స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది.

డ్రాగ‌న్ ఫ్రూట్‌లో బీటాలెయిన్స్, ఫ్లేవ‌నాయిడ్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. అలాగే ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి కూడా యాంటీ ఆక్సిడెంట్ మాదిరిగా ప‌నిచేస్తుంది. ఇవ‌న్నీ ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను తొల‌గిస్తాయి. దీంతో క్యాన్స‌ర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రావు. ఈ పండ్ల‌లో నీరు అధికంగా ఉంటుంది. క‌నుక వేస‌విలో దీన్ని తింటే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. ఎండ‌దెబ్బ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. అలాగే చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

శ‌రీర ఉష్ణోగ్ర‌త నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఈ పండ్లలో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్ అన‌బడే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జ‌బ్బుల‌ను రాకుండా నిరోధిస్తాయి. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయి. ఈ పండ్ల‌లో బీటాస‌య‌నిన్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరంలో ఉండే నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి. కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది.

ఈ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ సి చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటి వ‌ల్ల కొల్లాజెన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. ఇది చ‌ర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. దీంతోపాటు చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఈ పండ్ల‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఈ పండు బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. దీంతో శ‌రీరంలో కొవ్వు క‌రిగిపోతుంది. బ‌రువు త‌గ్గుతారు. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. లివ‌ర్ ఆరోగ్యంగా మారుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker