తుమ్ముని బలవంతంగా ఆపుతున్నారా.. ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి.
మన తుమ్ము గంటకు 100 మైళ్ల వేగంతో వస్తుంది. అటువంటి సమయంలో దాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తే.. దానికి రెట్టింపు ప్రభావం శరీర భాగంపై పడుతుంది. తుమ్మును బలవంతంగా ఆపేందుకు ప్రయత్నిస్తే మెదడులోని రక్త నాళాలు సైతం పగిలిపోయే ప్రమాదం ఉందని యూకేలోని యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ లీచెస్టర్‌కు చెందిన వైద్య నిపుణులు హెచ్చరించారు. అయితే సహజంగా జరిగే ప్రక్రియలు వేటినీ కూడా ఆపకూడదంటారు. అలా ఆపితే లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఎంతమందిలో ఉన్నా ఒక్కోసారి కొన్ని తప్పవు.. అంత మాత్రాన దానిని అవమానంగా భావించరాదు.. అవి అందరికీ జరిగే ప్రక్రియలే. ఇలాగే ఓ వ్యక్తి వచ్చే తుమ్ముని బలవంతంగా ఆపి చిక్కుల్లో పడ్డాడు. ముక్కు, నోరు గట్టిగా మూసేసి ఆపుకునే ప్రయత్నం చేశాడు. అది కాస్తా బెడిసి కొట్టడంతో ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఘటన బ్రిటన్ లో చోటు చేసుకుంది. సహజంగా జరిగిపోయే ప్రక్రియలను ఆపకూడదని పెద్దలు చెబుతుంటారు. అలా చేస్తే తర్వాత ఎన్నో అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుందని హెచ్చరికలు కూడా చేస్తూ ఉంటారు.
అయితే ఇలాంటి వాటిని కొంతమంది చాలా తేలిగ్గా తీసుకుని పట్టించుకోకుండా ఉంటారు. అలా చేసి.. ఓ వ్యక్తి లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏమైంది అంటారా. బలంగా తుమ్ము రాగా.. దాన్ని ఆ యువకుడు అడ్డుకున్నాడు. ముక్కు, నోరు గట్టిగా మూసివేసి.. తుమ్మకుండా ఆపుకునే ప్రయత్నం చేశాడు. ఇది కాస్త బెడిసి కొట్టడంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన బ్రిటన్‌లో జరిగింది. తుమ్ము వచ్చినప్పుడు తుమ్మకుండా దానిని అడ్డుకునేందుకు ముక్కు, నోరు గట్టిగా మూసుకున్నాడు.. దాంతో ఆ ధాటికి అతడి గొంతు పగిలిపోయినట్లు డాక్టర్లు చేసిన పరీక్షల్లో వెల్లడైంది.
తుమ్మును ఆపిన తరువాత అతడు అనారోగ్యానికి గురయ్యాడు. ఆహారం మింగాలంటే చాలా అవస్థ. గొంతులో ఏదో అయినట్లు, మెడ భాగం ఉబ్బడం, భరించలేని నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో అతడు ఆస్పత్రికి వెళ్లాడు. అన్ని పరీక్షలు చేసి సమస్యను గుర్తించిన డాక్టర్లు గొంతులోని కణజాలానికి పగుళ్లు వచ్చాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితి సాధారణంగా వాంతులు, దీర్ఘకాలం దగ్గు, కొన్ని రకాల గాయాల కారణంగా వస్తుందని పేర్కొన్నారు. తీవ్రమైన నొప్పిని అనుభవించిన యువకుడు ఆస్పత్రిలో రెండు వారాలు చికిత్స తీసుకున్నాడు. ఆ సమయంలో అతడికి పైపుల ద్వారా ఆహారం, ఔషధాలు అందించారు.
అయితే తుమ్మును ఆపడం చాలా ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముక్కు, నోరు మూసి ఆపాలని ప్రయత్నిస్తే ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది అని వెల్లడించారు. ఇలా తుమ్మును ఆపడం వల్ల ఊపిరితిత్తులు, ఛాతి మధ్య గాలి చిక్కుకుని సూడోమెడియాస్టినమ్ అనే వ్యాధి వస్తుందని పేర్కొన్నారు. దీంతో పాటు కర్ణభేరికి కూడా రంధ్రాలు పడతాయని, మెదడులోని రక్తనాళాలు కూడా ఉబ్బిపోతాయని తెలిపారు. దాని కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరికలు జారీ చేశారు.