మీరు అతిగా ఆలోచిస్తారా..? మీకు ఎన్ని రోగాలు వస్తాయో తెలుసుకోండి.
అతిగా ఆలోచిస్తున్నారనడానికి మెదట్లో కనిపించే లక్షణాలు అలసటగా ఉండటం, ఎక్కువగా కలల కనడం, నిదానంగా వ్యవహరించడం వంటివి ఉంటాయి. గడిచిన సంఘటనల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఇది మీ మనస్సులో గతంలో జరిగిన మానసిక గాయాన్ని నిద్రలేపుతూ ఉంటుంది. మీరు పాజిటివ్‌గా కాకుండా నెగిటివ్ ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. అయితే అతిగా ఆలోచించడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది ; నిరంతరం అతిగా ఆలోచిస్తే మనశ్శాంతిని కోల్పోవాల్సి వస్తుంది. రక్తపోటును మరింత పెంచి ఒత్తిడికి దారితీస్తుంది. స్ట్రోక్ , గుండెపోటు వంటి గుండె సమస్యలకు దారితీస్తుంది.
అధిక ఒత్తిడి అంటే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగటంతోపాటు దీనినుండి బయటపడేందుకు ధూమపానం,మద్యపానం వంటి అనారోగ్య అలవాట్లను అనుసరించే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. అతిగా ఆలోచించడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి.. అంతులేని ఆలోచనలు మిమ్మల్ని రాత్రిళ్లు మేల్కొనేలా చేస్తాయి. నిద్రపోవడంలో సమస్యలను ఎదుర్కోవడం అనేది అతిగా ఆలోచించడం వల్ల జరుగుతుంది. అతిగా ఆలోచించే వారైతే రాత్రిపూట మంచి నిద్ర పట్టదు.
మరుసటి రోజు ఉదయం గజిబిజిగా, పిచ్చిగా , అలసట వంటి పరిస్ధితి ఎదుర్కొంటారు. పనిపై దృష్టి పెట్టడం కష్టతరంగా మారుతుంది. బరువు పెరగడంతోపాటు అతిగా ఆహారం తీసుకునేలా చేస్తుంది. అతిగా ఆలోచించడం ఆకలిని అణిచివేస్తుంది.. తక్కువ సమయం పాటు ఎక్కువగా ఆలోచించడం ఆకలి లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఇది మీ మెదడు పై ప్రభావం చూపిస్తుంది. ఆకలితో ఉన్నారని లేదా తినడానికి సమయం ఆసన్నమైందని మెదడుకు సిగ్నల్ పంపకుండా అడ్డుకుంటుంది. అతిగా ఆలోచించడం వల్ల ఒత్తిడికి లోనయ్యే పరిస్ధితుల్లో ఉన్నవారు తినకుండా ఉండటం, లేదంటే అతిగా తినటం వంటి పరిస్ధితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ రెండు అలవాట్లు ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. అతిగా ఆలోచించడం మెదడుపై ప్రభావం చూపుతుంది ; అతిగా ఆలోచించడం అనేది మెదడు యొక్క నిర్మాణం, కనెక్టివిటీని దెబ్బతీస్తుంది. ఇది మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది. మానసిక వ్యాధులు ఆందోళన, ఒత్తిడి , నిరాశ వంటివి దృష్టిని కేంద్రీకరించే శక్తిని తగ్గిస్తాయి. ఏదైనా సమస్యను పరిష్కరించే విషయంలో నిర్ణయం తీసుకునే శక్తి పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.. అతిగా ఆలోచించడం వల్ల వచ్చే ఒత్తిడి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కడుపులో రక్త ప్రసరణ, ఆక్సిజన్ మొత్తాన్ని తగ్గిస్తుంది. అతిగా ఆలోచించడం వల్ల వచ్చే ఒత్తిడి జీర్ణశయాంతర సమస్యలకు దారితీస్తుంది.
రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది ; ఒత్తిడికి గురైతే, శరీరంలో కార్టిసాల్ హార్మోన్ విడుదల అవుతుంది, ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీని వల్ల అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అతిగా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తే, వెంటనే దాని నుండి బయటపడేందుకు ఏదో ఒక పనిచేసేందుకు ప్రయత్నం చేయండి. దీని వల్ల ఆలోచనల నుండి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ప్రతికూల ఆలోచనల నుండి మీ మనస్సును మరల్చడానికి ఇష్టమైన సంగీతాన్ని వినండి. ఒకడైరీని పెట్టుకుని అసలు ఏం ఆలోచిస్తున్నారో వాటి గురించి రాసుకోండి. మీలో ఉండే భయాన్ని, చింతలను సన్నిహితంగా ఉండే వ్యక్తులతో పంచుకోండి. దీని వల్ల కొంత భారం తగ్గుతుంది.