Health

మంచిదని ఎండు ద్రాక్షలను ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా..?

ఎండు ద్రాక్షలో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కండరాలు, ఎముకలు, కార్టిలేజ్ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్ తగినంత అవసరం. అలాగే, పీహెచ్ స్థాయి ఆరోగ్యకరంగా ఉండేలా చూస్తుంది. వ్యాధి నిరోధక శక్తికి కీలకంగా పనిచేస్తుంది. అయితే అతి ఎప్పుడూ అనర్థానికే దారి తీస్తుందన్నట్లు ఎండు ద్రాక్షవల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అతిగా తీసుకుంటే అనర్థాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

కిస్మిస్‌లను అతిగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు, షుగర్ లెవెల్స్ పెరగడం, బరువు పెరగడం వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కిస్మిస్ ను తినడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు.. జీర్ణక్రియ సమస్య..ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున మీ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అయితే వాటిని ఎక్కువగా తినడం వల్ల ఇతర పోషకాల శాతం తగ్గుతుంది.

ఎక్కువ నీరు తీసుకోకుండా ఎండుద్రాక్ష ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్, అజీర్ణం, ఇతర రుగ్మతలు ఏర్పడవచ్చు. షుగర్ సమస్య.. ఎండు దాక్ష అంటే సహజంగానే తీపి పదార్థకం ఇందో అధిక చక్కెర, కేలరీలు ఉంటాయి. కాబట్టి, డయాబెటిస్‌తో బాధపడేవారు ఎండుద్రాక్షను తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బరువు పెరిగే అవకాశాలు.. ఎండుద్రాక్షలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, మీరు బరువు తగ్గే ప్రయాణంలో ఉంటే, మీరు దానిని తీసుకోకపోవడం మేలు. ఒక వేళ తీసుకోవాల్సి వచ్చినా మితంగా తీసుకోవడం మంచిది. కణాలకు నష్టం..ఎండు ద్రాక్షలో పాలీఫెనాల్స్, బయోఫ్లేవనాయిడ్స్ మరియు ఫైటోన్యూట్రియెంట్స్ వంటి వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఎండుద్రాక్షను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కణాలకు ఆక్సీకరణ నష్టం జరగవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker