అతిగా కూల్ డ్రింక్స్ తాగితే ఈ ప్రమాదకరమైన జబ్బులు రావడం ఖాయం.
కూల్ డ్రింక్స్ ఎక్కువగా త్రాగటం వలన వాటిలో ఉండే చక్కర కంటెంట్ కారణంగా ఖచ్చితంగా బరువు ఎక్కువగా పెరుగుతారు.కూల్ డ్రింక్ లో దాదాపుగా 15 స్పూన్స్ పంచదార అనేది ఉంటుంది. సాధారణంగా ఇంత పంచదార తింటే ఖచ్చితంగా వాంతులు అవుతాయి. కానీ కూల్ డ్రింక్స్ తయారుచేసేటప్పుడు ఫోస్పరిక్ ఆమ్లంని కలుపుతారు. అందువల్ల కూల్ డ్రింక్స్ లో పంచదార ఎక్కువైనా కానీ వాంతులు రావు. దీని వల్ల పంచదార కొవ్వుగా మారి మన శరీర బరువు పెరుగుతుంది.
అయితే ఇందులో ఉండే రసాయనాలు తీవ్ర అనారోగ్య సమస్యలు దారి తీస్తుంది. ముఖ్యంగా గర్భీని స్త్రీలు ఈ డ్రింక్స్ తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శీతల పానీయాలు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు.. కూల్ డ్రింక్స్‌లో ఫ్రక్టోజ్ పరిమాణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ డ్రింక్స్ తాగడం వల్ల మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కాబట్టి ప్రతి రోజు కూల్ డ్రిక్స్ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. శీతల పానీయాలు కాలేయానికి చాలా హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే చెడు రసాయనాలు తీవ్ర కాలేయ సమస్యలకు దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు దారీ తీయోచ్చని కూడా ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ప్రస్తుతం చాలా మంది బాదంతో తయారు చేసిన శీతల పానీయాల మంచిదని భావిస్తారు. కానీ ఇవి శరీరానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో చక్కెర పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి తీవ్ర ఊబకాయాని, మధుమేహం సమస్యలకు దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అతిగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇందులో ఉండే రసాయన గుణాలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు. అతిగా శీతల పానీయాలు తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా చాలా మందిలో నోటి సమస్యలు కూడా రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఎండ కాలంలో కూల్ డ్రింక్స్‌ను అతిగా తీసుకోవడం మానుకోవాలి.