Health

కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగుతున్నారా..? మీలో ఆ సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంద‌ట‌..?

ప్రతిరోజూ రెండు లేదా అంతకంటే ఎక్కువ కూల్‌ డ్రింక్స్‌ తాగే పెద్దలు పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదానికి గురవుతున్నారని తేలింది. పరిశోధనలో ఫ్రూట్ ఫ్లేవర్డ్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్‌, ఎనర్జీ డ్రింక్స్ ఆరోగ్యానికి ప్రమాదకరమైనవిగా తేలాయి. అయితే కోకాకోలా.. ప్రపంచవ్యాప్తంగా అంద‌రూ ఇష్ట‌ప‌డే డ్రింక్‌. పిజ్జాలు, బర్గర్‌లు, బిర్యానీ, ఇతర జంక్‌ఫుడ్ తిన్న త‌ర్వాత చాలామంది త‌ప్ప‌కుండా కోక్ తాగుతారు. అయితే, కోకాకోలాతో ఎలాంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు లేక‌పోగా ప్ర‌తికూల ప్ర‌భావాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ట‌.

రెగ్యుల‌ర్‌గా కోకాకోలా ఆధారిత శీత‌ల‌పానీయాలు తాగేవారు అధిక బ‌రువు, మధుమేహం, ఇత‌ర వ్యాధుల‌బారిన ప‌డ‌తార‌ని ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది. కాగా, కోకాకోలా తాగేవారిలో జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిపోతుంద‌ని, త‌ద్వారా కొత్త విష‌యాల‌ను నేర్చుకునే సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంద‌ని తాజా అధ్య‌య‌నంలో తేలింది. ఈ అధ్య‌య‌నాన్ని బ్రెజిల్‌లోని శాంటా కాటరినా విశ్వవిద్యాలయాల పరిశోధకులు నిర్వహించారు.

ఎలుక‌ల‌పై వీరు ప్ర‌యోగం నిర్వ‌హించారు. వాటిని రెండు గ్రూపులుగా విభ‌జించి ఒక స‌మూహానికి నీరు, రెండో స‌మూహానికి కోక్‌, నీరు అందించారు. కోక్ తాగిన స‌మూహం పేల‌వ‌మైన జ్ఞాప‌క‌శ‌క్తిని క‌లిగి ఉన్న‌ద‌ని గుర్తించారు. అభిజ్ఞా పనితీరుతోపాటు కోలా తాగిన ఎలుకల సమూహం ఆక్సీకరణ ఒత్తిడిని కలిగి ఉందని క‌నుగొన్నారు. శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ మధ్య అసమతుల్యత ఉన్నప్పుడు ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది.

టాక్సిన్స్ సరిగ్గా బయటకు వెళ్లకపోతే అది ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవే ఫ‌లితాలు మ‌నుషుల్లోనూ క‌నిపిస్తాయ‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా శీతల పానీయం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి లోపం, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుందని తేల్చారు. ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌కు శీత‌ల‌పానీయాలు తాగే అల‌వాటు ఉంటే త్వ‌ర‌గా మాన్పించాల‌ని ప‌రిశోధ‌కులు సూచించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker