అలాంటి వారు వంకాయ కూరని తినకపోవడమే మంచిది, ఎందుకంటే..?
వంకాయలో విటమిన్లు, ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వంకాయ పొట్టులో ఉండే ఆంథోసియానిన్ ఫైటో న్యూట్రియెంట్‌ను న్యాసునిన్ అంటారు. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో ఎక్కువైన ఇనుమును తొలగిస్తుంది. అయితే వంకాయ కూరను ఎలా చేసినా బలే టీస్టీగా ఉంటుంది. అందుకే వంకాయంటే చాలా మందికి ఇష్టం. అందులో గుత్తివంకాయను లొట్టలేసుకుని లాగిస్తుంటారు. నిజానికి వంకాయ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయినప్పటికీ.. వంకాయను కొంతమంది మాత్రం అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయినా సరే అలాగే తింటామంటే మాత్రం ఎన్నో సమస్యలను ఏరికోరి కొనితెచ్చుకున్న వాళ్లవుతారు. వంకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా.. గర్భిణిలు వంకాయను అస్సలు తినకూడదు. ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలున్న వాళ్లు వంకాయను తినకపోవడమే ఉత్తమం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవాళ్లు వంకాయ కూరను తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఒకవేళ తింటే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువవుతుంది. కొందరికి కొన్ని ఆహారాలు అస్సలు పడవు. అవి తిన్న వెంటనే అలెర్జీ వస్తుంది. ఇలాంటి వారు కూడా వంకాయ కూరను తినడం మానుకోవాలి.
ఎందుకంటే ఇది కూడా అలెర్జీని కలిగిస్తుంది. సమస్యను పెంచుతుంది. డిప్రెషన్ మనిషిని మానసికంగానే కాదు.. శారీరకంగా కూడా దెబ్బతీస్తుంది. అయితే డిప్రెషన్ తగ్గాలని ఎవరైతే మందులు వాడుతున్నారో.. వాళ్లు వంకాయ కూరను తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను ఎక్కువ చేస్తుంది. డిప్రెషన్ మనిషిని మానసికంగానే కాదు.. శారీరకంగా కూడా దెబ్బతీస్తుంది. అయితే డిప్రెషన్ తగ్గాలని ఎవరైతే మందులు వాడుతున్నారో.. వాళ్లు వంకాయ కూరను తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను ఎక్కువ చేస్తుంది. ఎలాంటి కంటి సమస్యలున్నా.. వంకాయ కూరను తినకపోవడమే మంచిది.
ఎందుకంటే వంకాయలను తినడం వల్ల కంటిలో దురద, మంట సమస్యలు ఎక్కువ అవుతాయి. కంటి వాపు ఉన్నవారు కూడా వంకాయ కూరను తినకూడదు. అర్షమొలల బాధ మాటల్లో చెప్పలేనిది. సరిగా కూర్చోలేని, పడుకోలేని, నడవలేని పరిస్థితి వీళ్లది. అయితే పైల్స్ ఉన్నోళ్లు కూడా వంకాయను తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వంకాయ కూరను తింటే పైల్స్ మరింత ఎక్కువవుతాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు పొరపాటున కూడా వంకాయను తినకూడదు. ఎందుకంటే వంకాయలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీల్లో రాళ్లను పెంచుతాయి.