Health

ఇలాంటి వారు ఖర్జూర పండు తినకపోవడమే మంచిది.పొరపాటున తిన్నారో..?

గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేరుగా చెట్ల నుంచి ఖర్జూర పండ్లను సేకరించి తింటారు. ఇక పట్టణ, నగరాల్లో ప్రజలు కొనుగోలు చేసి తింటారు. చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఖర్జురను తప్పక తింటారు. ఖర్జూర పండును తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూర ఒకటి. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది ఎంత రుచిగా ఉంటుందో శరీరానికి అంతే మేలు చేస్తుంది. ఇందులో పోషకాలకు కొదవ లేదు.

ఖర్జూరం తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్స్ అందుతాయి. ఇది తక్షణ శక్తిని అందిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. అంతే కాకుండా ఇది పుష్కలంగా కేలరీలు, ఫైబర్, విటమిన్ B6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్లను అందిస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది ఖర్జూరం తినకూడదు. తక్కువ బ్లడ్ షుగర్.. టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులకు ఖర్జూరాలు స్వీట్లకు మంచి ప్రత్యామ్నాయమని చెప్పవచ్చు. కానీ వాటిని ఎక్కువగా తింటే హైపోగ్లైసీమియా బారిన పడుతారు. ఈ పరిస్థితిలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. దీని కారణంగా శరీరంలో బలహీనత, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

స్థూలకాయం.. ఖర్జూరాల్లో పెద్ద మొత్తంలో కేలరీలు ఉంటాయి. బరువు తగ్గడానికి దీన్ని తీసుకుంటే అంత ప్రభావం చూపకపోవచ్చు. దీని కోసం ఇతర డ్రై ఫ్రూట్స్‌ ఎంచుకోవడం ఉత్తమం. అలర్జీ.. ఖర్జూరాలను పరిమితికి మించి తినడం వల్ల అలర్జీ వస్తుంది. వాస్తవానికి ఈ తీపి పండులో చాలా సల్ఫైడ్‌లు ఉంటాయి. ఇది అలెర్జీలకు కారణమవుతుంది. చాలా మందికి కళ్లలో దురద, కళ్లు ఎర్రబడడం, వంటి సమస్యలు ఏర్పడుతాయి.

కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం. ఏదైనా పరిమితికి మించి తింటే దుష్ప్రభావాలు ఉంటాయి. కాబట్టి లిమిట్‌గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker