ఇలాంటివారు బీట్ రూట్ తినకపోవడమే మంచిది. ఒకవేళ తిన్నారో..?
బీట్ రూట్ తినడం వలన చాలా రకాల అనారోగ్యసమస్యలు రావు.ఎందుకంటే బీట్ రూట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ A,విటమిన్ B6,ఐరన్ వంటి ఎన్నో పోషకాలతో పాటుగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి ఎన్నో మూలకాలు ఉన్నాయి. అయితే బిట్ రూట్‌లో ఎన్నో ఆరోగ్య లక్షణాలు ఉన్నప్పటికి కొంత మంది వాటిని తినడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి.
అలెర్జీతో బాధపడేవారు బీట్‌రూట్ తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, అలెర్జీ వంటివి మరింత తీవ్రమవుతాయి. అలెర్జీతో బాధపడేవారు బీట్ రూట్ ను తమ డైట్ లో తీసుకోకూడదు.ఇంకా అలాగే ఆక్సలేట్ కలిగి ఉండే వ్యక్తుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీట్‌రూట్ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం.
వాస్తవానికి బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నట్లయితే దుంపలు తినడాన్ని నివారించవచ్చు. ఒకవేళ తిన్నా చాలా పరిమితంగా తీసుకోవడం మంచిది. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. చక్కెర స్థాయి ఇప్పటికే ఎక్కువగా ఉన్నవారు బీట్‌రూట్ తినకూడదు. బీట్‌రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది.
ఈ కారణంగా, రక్తంలో అధిక చక్కెర ఉన్నవారు బీట్‌రూట్ వినియోగానికి దూరంగా ఉండాలి. బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. బీట్‌రూట్‌లో కాపర్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం ఉంటాయి. ఈ ఖనిజాలు కాలేయంలో పెద్ద మొత్తంలో చేరడం వల్ల.. అవి తీవ్రంగా దెబ్బతీంటాయి. బీట్‌రూట్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కాల్షియం తగ్గుతుంది. ఇది ఎముకల సమస్యను పెంచుతుంది.