Health

మాంసం తినేవారికి ఈ విషయం తెల్సితే మానేస్తారేమో..? ఆశ్చర్యపోయే విషయాలు చెప్పిన శాత్రవేత్తలు.

కొన్ని మాంసాల రకాలలో అలెర్జీని ప్రేరేపించగల ప్రోటీన్లు ఉంటాయి. అలాంటి మాంసాన్ని మీరు తిన్నప్పుడు మీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందిస్తుంది. ఈ సమయంలో శరీరం రక్తప్రవాహంలోకి హిస్టామిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు అలెర్జీ ప్రతిచర్య జరుగుతుంది. హిస్టమైన్ కొన్నిసార్లు తీవ్రమైన దుష్ప్రభావాలను ప్రేరేపిస్తుంది, దీని వలన రక్త నాళాలు విస్తరిస్తాయి, శ్లేష్మం ఉత్పత్తి చేసే కణాలు సక్రియం అవుతాయి. అయితే యూకేకి చెందిన వీరు చేసిన కొత్త అధ్యయనంలో గ్రాఫిక్ వార్నింగ్స్ జోడించడం వల్ల ప్రజల మాంసాహార ఎంపికలను ప్రభావితం చేయవచ్చని తేలింది.

ఈ గ్రాఫిక్ వార్నింగ్స్ వల్ల మాంసాహారులు తరచుగా వెజిటేబుల్ ఫుడ్స్ ను ఎంచుకోవచ్చని కూడా అధ్యయనం సూచిస్తోంది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు , పర్యావరణ క్షీణతకు ప్రధాన కారణమైన మాంసం వినియోగాన్ని తగ్గించడానికి ఒక కొత్త వ్యూహాన్ని పరీక్షించడం లక్ష్యంగా ఈ అధ్యయనం జరిగింది. మాంసం, డెయిరీ ప్రొడక్ట్స్ ప్రపంచ ఉద్గారాలలో 14 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఫార్మింగ్ కూడా అటవీ నిర్మూలన, జీవవైవిధ్య నష్టాని కి కారణమవుతుంది. స్టడీ ఎలా చేశారు.. పరిశోధకులు 1,000 మంది మాంసం తినే పెద్దలతో ఆన్‌లైన్ ప్రయోగాన్ని నిర్వహించారు, వారిని నాలుగు గ్రూపులుగా విభజించారు.

ప్రతి గ్రూప్‌కు వేర్వేరు హాట్ మీల్స్ ఇమేజ్‌లు చూపించారు. వాటిలో కొన్ని మాంసం, కొన్ని శాఖాహారం ఫుడ్స్ ఉన్నాయి. ఈ ఇమేజ్‌లలో మాంసం తినడం వల్ల వాతావరణం, ఆరోగ్యం లేదా మహమ్మారి ప్రభావాల కలుగుతాయని తెలియజేసే లేబుల్స్‌ అతికించారు. వెజిటేబుల్ ఫుడ్ ఇమేజ్‌లకు లేబుల్ అతికించలేదు. అన్ని రకాల హెచ్చరికలు ప్రజల ప్రాధాన్యతలపై చెప్పుకోదగిన ప్రభావాన్ని చూపుతాయని ఫలితాలు చూపించాయి. ఈ గ్రాఫిక్ వార్నింగ్స్‌ శాఖాహార భోజనాన్ని ఎంచుకునే అవకాశాన్ని 7-10 శాతం పెంచాయి. పార్టిసిపెంట్లలో ఆ క్లైమేట్ వార్నింగ్ లేబుల్స్‌ మోస్ట్ ఎఫెక్టివ్, క్రెడిబుల్ గా ఉన్నాయి. ఈ లేబుల్స్‌ అడవి మంటలు, కరువుల దృశ్యాలను చూపించాయి. “వార్నింగ్: ఈటింగ్ మీట్ కాంట్రిబ్యూట్స్ టు క్లైమేట్ చేంజ్.” అని ఆ లేబుల్స్‌పై రాశారు.

సిగరెట్ లేబుల్స్‌తో పోలిక..పరిశోధకులు వారి విధానాన్ని అనేక దేశాలలో సిగరెట్ ప్యాక్‌లపై ఉపయోగించే గ్రాఫిక్ వార్నింగ్ లేబుల్స్‌తో పోల్చారు. సిగరెట్ లేబుల్స్‌ అకాల పుట్టుక, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాస సమస్యలు వంటి ఆరోగ్యంపై ధూమపానం హానికరమైన ప్రభావాలను చూపుతాయి. 2021లో గతంలో జరిపిన ఒక అధ్యయనంలో సిగరెట్ ప్యాక్‌లపై ఉండే గ్రాఫిక్ వార్నింగ్ లేబుల్స్ 42 శాతం మంది పొగ తాగని వారిని ధూమపానానికి ప్రయత్నించకుండా నిరోధించాయని పరిశోధకులు కనుగొన్నారు.

దాదాపు మూడు వంతుల జనాభా మాంసం తినే యూకేలో మాంసం వినియోగం, ఉద్గారాలను తగ్గించడానికి మాంసం ఉత్పత్తులపై గ్రాఫిక్ వార్నింగ్ లేబుల్స్‌ యూజ్‌ఫుల్ పాలసీ టూల్‌గా ఉంటాయని పరిశోధకులు వాదించారు. యూకే ప్రభుత్వానికి సలహా ఇచ్చే క్లైమేట్ చేంజ్ కమిటీ దేశ వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి బ్రిటీషర్లు మాంసం, పాల తీసుకోవడం 20 శాతం తగ్గించాలని సిఫార్సు చేసింది. అధ్యయనం ప్రధాన రచయిత జాక్ హ్యూస్ ఇలా మాట్లాడుతూ.. ‘ధూమపానంతో పాటు చక్కెర పానీయాలు, ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడంలో వార్నింగ్ లేబుల్స్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయి, మాంసం కలిగిన ఉత్పత్తులపై కూడా ఈ లేబుల్‌ను ఉపయోగించడాన్ని నేషనల్ పాలసీ చేస్తే వాటి వినియోగాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది.’ అని అన్నారు.

పర్యావరణం, జంతువులను రక్షించడానికి మొక్కల ఆధారిత ఆహారాన్ని ప్రోత్సహించే సంస్థ వేగానూరీని కూడా అధ్యయనం గురించి కూడా ప్రస్తావించింది. Veganuary ప్రకారం, ఎక్కువ మంది ప్రజలు శాకాహారి జీవనశైలిని అవలంబించడానికి ఆసక్తి చూపుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker